ఇటీవల కాలంలో క్రికెట్ కి ఉన్న పాపులారిటీ ప్రపంచ దేశాలలో అంతకంతకు పెరిగిపోతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎన్నో టీమ్స్ ఎప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ.. ఇక అదరగొడుతూ ఉంటాయి. అయితే క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో.. అటు ప్రేక్షకులు అందరిని కూడా ఆశ్చర్యపరిచే ఘటనలు చాలానే వెలుగులోకి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాళ్ళు కొన్ని కొన్ని సార్లు ప్రసాదరణమైన రీతిలో విన్యాసాలు చేస్తూ ఉంటారు. కొంతమంది బౌండరీ లైన్ దగ్గర అసాధ్యమైన రీతిలో ఏకంగా క్యాచ్లు అందిపుచ్చుకోవడం చేస్తే ఇంకొంతమంది స్లిప్ లో ఫీలింగ్ చేస్తూ  ఇలాంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు.



 అయితే ఇలా మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ఎవరైనా ప్లేయర్ ఇలాంటి క్యాచ్ పట్టాడు అంటే అది నిజమా అబద్దమా అని నమ్మడం కూడా అటు మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు అయోమయంగా ఉంటుంది. ఆ తర్వాత రిప్లై లో స్లో మోషన్ లో  చూపించినప్పుడు ఆ ప్లేయర్ క్యాచ్ పట్టడానికి చేసిన విన్యాసం గురించి చూసి అందరూ అవాక్ అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలా అద్భుతమైన క్యాచ్లకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.


 శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో 35 ఏళ్ల న్యూజిలాండ్ ప్లేయర్ టిమ్ సౌదీ అదిరిపోయే క్యాచ్ పట్టాడు. లంకా ప్లేయర్ నిస్సాంక కొట్టిన షాట్ ను సౌదీ గాల్లోకి ఎగిరి పట్టుకున్నాడు. అయితే రెప్పపాటు కాలంలో అతను స్పైడర్ మ్యాన్ లాగా గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది అని చెప్పాలి. అయితే 2024 లో అంతర్జాతీయ క్రికెట్లో నమోదైన బెస్ట్ క్యాచ్ లలో ఇది కూడా ఒకటి అంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అతని టాలెంట్ కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. 35 ఏళ్ల వయసులో కూడా ఆయన ఎంతో ఫిట్ గా ఉన్నాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: