ప్రొఫెషనల్ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు ఏకంగా హుందాగా వ్యవహరించకుండా ఇలా ఏకంగా వీధి రౌడీల్లా కొట్టుకోవడం ఏంటి అని ఎంతో మంది విమర్శలు కూడా చేశారు. ఏకంగా జట్టును గెలిపించాలనే బాధ్యత ఎవరికి లేదు. కానీ ఈగోలకు పోయి ఇలా ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడమేంటీ.. ఇలా అయితే ఇక పాకిస్తాన్ క్రికెట్ బాగుపడట్టే అని ఆ దేశం మాజీలు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఇలాంటి ఘటన మరోసారి జరిగింది. పాకిస్తాన్లో ఏకంగా బౌలర్ బ్యాట్స్మెన్ ఇద్దరూ ఒకరిపై ఒకరు పిడుగుద్దులు కురిపించుకుంటూ మైదానంలోనే దారుణంగా కొట్టుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇది ఒక లోకల్ మ్యాచ్లో జరిగిన ఘటన. అక్కడ జరిగిన ఒక లోకల్ మ్యాచ్లో బౌలర్ బ్యాటర్ ఒకరిపై ఒకరు పిడుగుద్దులు కురిపించుకున్నారు. వికెట్ తీసిన బౌలర్ బ్యాట్స్మెన్ వద్దకు వెళ్లి పదే పదే కవ్వించాడు. సహనం కోల్పోయిన బ్యాటర్ తిరిగి తిట్టాడు. మాట మాట పెరిగి ఇద్దరు మళ్ల యోధుల్లాగా కిందపడి మరి దారుణంగా కొట్టుకున్నారు. అయితే అక్కడ ఉన్న మిగతా క్రికెటర్లు ఆపేందుకు ప్రయత్నించినా.. ఏకంగా వికెట్లతో కొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. ఇది చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు. అదేమైనా క్రికెట్ మ్యాచా లేకపోతే చాపల మార్కెట్ అలా కొట్టుకుంటున్నారు అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు నేటిజన్స్.