టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. భారత జట్టు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో రెండు వరల్డ్ కప్ లు గెలుచుకుంది అన్న విషయం అందరికీ తెలుసు. అయితే ఈ రెండు వరల్డ్ కప్ లు గెలవడంలో కీలక పాత్ర వహించింది స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అని చెప్పాలి. ఒక రకంగా జట్టుకు వెన్నుముక్కల నిలబడి కష్టాల్లో ఉన్న ప్రతిసారి కూడా తన ప్రదర్శనలతో ఆదుకుంటూ వచ్చాడు. ఇక కేవలం రెండు వరల్డ్ కప్ ప్రదర్శన మాత్రమే కాదు యువరాజ్ తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు కూడా ఆడాడు.


 స్టార్ ఆల్ రౌండర్ గా దాదాపు దశాబ్ద కాలానికి పైగానే టీమ్ ఇండియాకు సేవలు అందించాడు అని చెప్పాలి. మరి ముఖ్యంగా యువరాజ్ తన కెరీర్ లో కొట్టిన ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల రికార్డును క్రికెట్ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఏకంగా తనను కవ్వించిన బౌలర్ కు బుద్ధి చెప్పేందుకు ఏకంగా ఉగ్రరూపం దాల్చిన యువరాజ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లను కొట్టి ప్రేక్షకులు అందరిని కూడా ఫిదా చేశాడు. అయితే యువరాజ్ సింగ్ అటు అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించి రోజులు గడుస్తున్న ఇక అతను సాధించిన ఈ రికార్డు గురించి మాత్రం అందరూ ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే ఇక యువరాజ్ సింగ్ 6 బంతులు ఆరు సిక్సర్లు కాదు ఏకంగా ఏడు సిక్సర్లు కొట్టే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు అంటూ ఇటీవలే ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ చెప్పుకొచ్చాడు. 2007లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో మ్యాచ్ సమయంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకున్నాడు ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్టు బ్రాడ్. ఆ రోజు అంపైర్ కారణంగా ఇవి ఏడో సిక్స్ మిస్ అయింది అంటూ తెలిపాడు. ఆ ఓవర్ లో రీప్లే నేను మళ్ళీ ఎప్పుడూ చూడలేదు. కానీ ఒక్క విషయం ఒప్పుకోవాలి. అంపైర్ చూడకపోవడం వల్ల ఆ ఓవర్లో ఒక నోబాల్ వేసిన తప్పించుకున్నాను. లేకపోతే ఆ బంతికి కూడా సిక్సర్ కొడితే.. యువరాజ్ ఆరు బంతుల్లోనే 7 సిక్సర్లు కొట్టి ఉండేవాడు అంటూ స్టువర్ట్ బ్రాడ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: