ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లో ఏదైనా మ్యాచ్ జరిగినప్పుడు ఎవరైనా ప్లేయర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు అంటే అతను ఎవరో అగ్రశ్రేణి టీం కి చెందిన ఆటగాడే అయి ఉంటాడు అని అందరూ అనుకునేవారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఏకంగా చిన్న టీమ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు సైతం అందరిని ఆశ్చర్యపరిచే విధంగా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఏకంగా ఇలాంటి ప్రదర్శనలతో ఎన్నో అరుదైన రికార్డులు కూడా సొంతం చేసుకుంటూ ఉన్నారు.


 కొంత మంది ప్లేయర్లు  అయితే తమ దేశ క్రికెట్లో తమను మించిన అత్యుత్తమ ఆటగాళ్లు మరొకరు లేరు అనే రేంజ్ లో రికార్డులు కొల్లగొడుతూ ఉండటం చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకో బోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే క్రికెటర్ ఏకంగా బంగ్లాదేశ్ క్రికెట్ హిస్టరీలోనే అత్యుత్తమ ప్లేయర్. అతన్ని మించిన ప్లేయర్ మరొకరు ఆ దేశ క్రికెట్ చరిత్రలోనే లేరు. అలాంటి ఒక అరుదైన రికార్డును సాధించాడు ఆ ప్లేయర్. అది కూడా ఇప్పుడు భారత జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఈ ఘనతను అందుకోవడం గమనార్హం.


 బంగ్లాదేశ్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ప్లేయర్ ముష్ఫికర్ రహీం గురించి దాదాపుగా క్రికెట్ ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. కాగా ఈ ప్లేయర్ ఇటీవల సరికొత్త చరిత్ర సృష్టించాడు. బాంగ్లాదేశ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్గా నిలిచాడు. ఇప్పటి వరకు అతను 15,205 పరుగులు చేశాడు. అయితే భారత జట్టు తో జరుగుతున్న జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 13 పరుగులు చేయడం ద్వారా తమిమ్ ఇక్బాల్ 15197 పరుగులను దాటేసి.. ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: