టీమిండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే రికార్డుల రారాజు అని పేరు సంపాదించుకున్నాడు ఈ స్టార్ ప్లేయర్. ఏకంగా మూడు ఫార్మట్లలో కూడా సత్తా చాటుతూ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించాడు అని చెప్పాలి. కోహ్లీ క్రీజు లో ఉన్నాడు అంటే చాలు స్కోరు బోర్డు సైతం భయపడేది. ఎక్కడ పరుగులు పెట్టి ఆయాస పడాల్సి వస్తుందో అని.


 ఆ రేంజ్ లో రికార్డుల మూత మోగించాడు విరాట్ కోహ్లీ. అయితే ఇక ఈ తరంలో రికార్డుల విషయంలో ఏ స్టార్ క్రికెట్ కి అందనంత దూరంలో ఉన్నాడు అని చెప్పాలి. అయితే కోహ్లీ సాధించిన రికార్డులను బద్దలు కొట్టడం అంత సులభమైన విషయమేమి కాదు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం కొంతమంది యాంగ్ క్రికెటర్లు తమ టాలెంట్ తో కోహ్లీ సాధించిన కొన్ని రికార్డులను బద్దలు కొట్టగలుగుతున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక రికార్డును సమం చేశాడు ఓ యంగ్ క్రికెటర్. అది కూడా ఆఫ్గనిస్తాన్ లాంటి చిన్న టీం తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ కోహ్లీ రికార్డును బ్రేక్ చేయడం గమనార్హం.


 ఆఫ్ఘనిస్తాన్ జట్టు తరఫున ప్రాతినిద్యం వహీస్తున్న గుర్బాజ్ ఇటీవల విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఒక రికార్డును సమం చేశాడు. దక్షిణాఫ్రికా తో జరుగుతున్న వన్డే సిరీస్లో ఆఫ్ఘనిస్తాన్ రెండో వన్డే విజయాన్ని సాధించి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ సెంచరీ తో ఏకంగా జట్టు గెలుపులో కీలక పాత్ర వహించాడు గుర్బాజ్. ఏకంగా తన సెంచరీ తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడూ. అయితే ఇది అతనికి ఏడో వన్డే సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలోనే కేవలం 23 ఏళ్ల లోపే వన్డే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ రికార్డును సమం చేశాడు. అయితే ఈ లిస్టులో 8 సెంచరీలతో డికాక్ మొదటి స్థానంలో ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: