ఇదిలా ఉండగా.... ఐసీసీ నివేదిక ప్రకారం, WTC ఫైనల్స్ కు అర్హతను సాధించాలంటే టీం ఇండియా రాబోయే తొమ్మిది మ్యాచుల్లో కనీసం 6 మ్యాచ్లను గెలవాలి. ఇందులో బంగ్లాదేశ్ తో ఒక టెస్టు మ్యాచ్ ను, న్యూజిలాండ్ తో 3 టెస్ట్ మ్యాచ్ లను భారత్ తన సొంత మైదానంలో ఆడబోతోంది. ఆ తర్వాత జట్టు విదేశీ గడ్డపై అంటే ఆస్ట్రేలియాలో ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది.
ఫైనల్ చేరాలంటే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ టాప్-2లో కచ్చితంగా ఉండాలి. తద్వారా ఐదు మ్యాచ్లు గెలిచిన ఒక మ్యాచ్ డ్రా చేసుకున్న భారత్ కు ఫైనల్ టికెట్ దక్కుతుంది. డబ్ల్యుటిసి ఫైనల్స్ కు గట్టి పోటీ ఇస్తున్న ఆస్ట్రేలియా పాయింట్ల జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఫైనల్ కు చేరాలంటే ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్లు గెలవాలి లేదా మూడు మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ డ్రా చేసుకోవాలి.