ఐపీఎల్ 2025కి ఇంకా చాలా సమయమే ఉన్నా, ఈ టోర్నమెంట్‌కి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటినుంచే మొదలైపోయాయి. ఈ టోర్నమెంట్ మొదలయ్యే ముందు ఒక పెద్ద వేలం జరగబోతుంది. ఈ వేలం గురించి చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయి కానీ, బీసీసీఐ ఇంకా అధికారికంగా ఏమీ చెప్పలేదు. అయితే, బీసీసీఐ సెక్రటరీ జై షా, తర్వాతి ఐపీఎల్‌లో ఆడే ప్రతి ఆటగాడికి ఒక్కొక్క మ్యాచ్‌కు 7.5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇది పెద్ద బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్‌లో అతి పెద్ద పండగలాంటిది. ఈ పండగ ఏటా జరుగుతుంది. ఇందులో భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఆటగాళ్లు పాల్గొంటారు.

ఇంతకు ముందు ఏం జరిగేది అంటే ఈ ఆటగాళ్లను వివిధ జట్ల యజమానులు వేలం ద్వారా కొనుగోలు చేసేవారు. వేలంలో ఎంత ధరకు అమ్ముకున్నారో, ఆ ఆటగాడికి అంత డబ్బు వేతనంగా ఇచ్చేవారు. అంటే, ఆటగాడు ఎన్ని మ్యాచ్‌లు ఆడినా, ఒకేసారి అంత డబ్బు వచ్చేది. ఆటగాడు మంచిగా ఆడితే, అదనంగా బహుమతులు కూడా ఇచ్చేవారు.

కానీ ఇప్పుడు బీసీసీఐ అనే క్రికెట్ బోర్డు ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి మ్యాచ్ ఆడినందుకు ఆటగాళ్లకు అదనంగా డబ్బు ఇస్తారట. అంటే, ఒక ఆటగాడు ఒక మ్యాచ్ ఆడితే 7.5 లక్షల రూపాయలు అదనంగా వస్తాయి. ఒక సీజన్‌లో ఒక ఆటగాడు అన్ని మ్యాచ్‌లు ఆడితే, కోటి రూపాయలకు పైగా అదనపు డబ్బు వస్తుంది. ఈ నిర్ణయం వల్ల ఏమవుతుంది అంటే ఆటగాళ్లు మరింత కష్టపడి ఆడతారు. ప్రతి మ్యాచ్‌ను గెలవాలని ప్రయత్నిస్తారు. క్రికెట్ ఆట మరింత ఆసక్తికరంగా మారుతుంది.

ఇప్పుడు ఆటగాళ్లు లీగ్ స్టేజ్‌లో 14 మ్యాచ్‌లు మాత్రమే ఆడరు. ప్లేఆఫ్స్ అనేవి ఉంటాయి. అందులోనూ మరో 3 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది. అంటే, ఒక ఆటగాడు మొత్తం 17 మ్యాచ్‌లు ఆడవచ్చు. ఒక ఆటగాడు 17 మ్యాచ్‌లు ఆడితే, అతనికి మొత్తం 1.23 కోట్ల రూపాయలు వస్తాయి. ఒక ఆటగాడు వేలంలో కేవలం 20 లక్షల రూపాయలకే అమ్ముడుపోయినా , అతను అన్ని మ్యాచ్‌లు ఆడితే, అతనికి మొత్తం 1.05 కోట్ల రూపాయలు వస్తాయి.

పెద్ద పేరున్న ఆటగాళ్లు వేలంలో కోట్ల రూపాయలకు అమ్ముకునేవారు. కొత్తగా వచ్చిన ఆటగాళ్లు కేవలం 20 లక్షల రూపాయలకే అమ్ముడు పోయేవారు. కొత్త నిబంధన ప్రకారం, ఆటగాడు ఎంతకు అమ్ముడుపోయిననా, ఎన్ని మ్యాచ్‌లు ఆడితే అంత డబ్బు వస్తుంది. వారు కూడా పెద్ద ఆటగాళ్లలాగే ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl