ఈ క్రమంలోనే టీమ్ ఇండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న మహమ్మద్ షమీ గురించి ఇలాంటి పర్సనల్ విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మహమ్మద్ షమీ తన భార్య హసీన్ జహాన్ తో విడాకులు తీసుకుని ఎన్నో రోజులు గడుస్తున్నాయి. కానీ ఇప్పటికీ కూడా ఏదో ఒక విషయంపై మహమ్మద్ షమిని టార్గెట్ చేస్తూ అతని మాజీ భార్య హసీన్ జహాన్ సోషల్ మీడియాలో సంచలన కామెంట్లు చేయడం చూస్తూ ఉంటాము. ఇక ఇప్పుడు మరోసారి ఇలా శమిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది హాసిన్ జహాన్. కూతురు ఐరా పై భారత స్టార్ బౌలర్ షమీ చూపించే ప్రేమ అంతా కేవలం ఒక నాటకమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
అదంతా కేవలం కపట ప్రేమ అని.. సోషల్ మీడియాలో జనాల కోసం మాత్రమే ఇలా షమీ నటిస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించింది. ఇటీవలే కుమార్తెను కలిసిన షమి కూతురితో ఎంతో సరదాగా గడిపిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే పబ్లిసిటీ కోసమే షమీ ఇలా చేస్తున్నాడు అంటూ అతని మాజీ భార్య హసీన్ జహాన్ ఆరోపించింది. ఐరా అడిగిన గిటార్ కెమెరా శమీ కొనివ్వలేదు. కేవలం అతను స్పాన్సర్ గా ఉన్న ఒక కంపెనీ స్టోర్ నుంచి షూస్ బట్టలు మాత్రమే తీసుకొని ఇచ్చాడు గతంలో ఎప్పుడూ కూడా ఐరా తో ఇలాంటి వీడియోలు షేర్ చేయలేదు ఇదంతా కేవలం నాటకమే అంటూ హసీన్ జహాన్ వ్యాఖ్యానించింది.