2025 ఐపీఎల్ సీజన్ కి ముందు మెగా వేలం ప్రక్రియ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మెగా వేలంలో ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్ళబోతున్నాడు అనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు కూడా ఇందుకు సంబంధించిన ప్రణాళికలను  సిద్ధం చేసుకుంటున్నయ్. అయితే ఈ ఏడాది చివర్లో డిసెంబర్ నెలలో ఈ మెగా వేలం ప్రక్రియ జరగబోతుంది. దీంతో ఇక కేవలం ఐదుగురిని మాత్రమే రిటైన్ చేసుకునేందుకు అటు బీసీసీఐ అవకాశం కల్పించింది.


 ఈ క్రమంలోనే ఐపిఎల్ వేలంలోకి వదిలేసి రిటైన్ చేసుకోబోయే ఐదుగురు ఆటగాళ్లు ఎవరు అనే విషయంపై కూడా కసరతులు చేస్తున్నాయి అని ఫ్రాంచైజీలు. అయితే ఇక ఇప్పుడు జట్టులో ఉన్న ఆటగాళ్ల అందరిని కూడా మార్చుకునేందుకు అవకాశం రావడంతో.. ఆర్సిబి మరోసారి పటిష్టమైన జట్టును తయారు చేసుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంది అన్నది తెలుస్తుంది. ముందుగా తమ పర్స్  నింపుకోవడానికి ఖరీదైన ఆటగాళ్లను  ఏకంగా వేలంలోకి వదిలేయడానికి సిద్ధమవుతుందట. ఇందులో ఇద్దరు టీమిండియా ప్లేయర్లు అయితే మరో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు కావడం గమనార్హం.


 ఏకంగా 14 కోట్ల రూపాయలు చెల్లించి మహమ్మద్ సిరాజ్ని ఆర్సిబి జట్టులోకి తీసుకుంది జట్టు యాజమాన్యం.  కానీ అతను మాత్రం అంచనాలకు తగ్గట్లుగా ఆడటం లేదు. దీంతో అతని వదిలేయాలని అనుకుంటుందట మేనేజ్మెంట్.


 యంగ్ ప్లేయర్ రజిత్ పటిదార్ ను 11 కోట్లకు ఆర్సిబి కొనుగోలు చేసింది. కానీ అతని వదులుకోవడమే మేలు అన్న విధంగా అతని ఆట తీరు కొనసాగుతుంది. ఆర్ సి బి కూడా అదే చేయబోతుందట.

 ఎన్నో ఆశలు పెట్టుకొని 11 కోట్లు పెట్టి ఆల్ రౌండర్ మ్యాక్స్వెల్ ను జట్టులోకి తీసుకుంది ఆర్సిబి. అయితే అతను ఆర్సిబి తరఫున ఆడిన మొదటి సీజన్లు అదరగొట్టినప్పటికీ ఆ తర్వాత మాత్రం చెత్త ప్రదర్శన చేస్తూ జట్టుకు భారంగా మారిపోతూ ఉన్నాడు. అతన్ని రిలీజ్ చేయాలని అనుకుంటుందట జట్టు యాజమాన్యం.


 భారీ అంచనాలతో కామరూన్ గ్రీన్ కి 14 కోట్ల భారీ ధర పెట్టి ఆర్సిబి కొనుగోలు చేసింది. కానీ రేటుకు తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. దీంతో అతని రిటైన్ లిస్ట్ నుంచి తప్పించబోతున్నట్లు తెలుస్తోంది.


 అదే సమయంలో కెప్టెన్ డూప్లెసెస్ ని కూడా ఇక ఆర్సిబి జట్టు వేలంలోకి వదిలేసేందుకు సిద్ధమవుతుందట. కాస్ట్లీ ప్లేయర్లుగా ఉన్న ఈ ఐదుగురుని వదిలేసి.. మళ్లీ పర్స్ మనీని పెంచుకోవాలని చూస్తుందట బెంగళూరు జట్టు యాజమాన్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

rcb