క్రికెట్ అంటేనే ఫన్నీ గేమ్ అని చెబుతూ ఉంటారు. కానీ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఉండే ఉత్కంఠ ఏకంగా ప్రేక్షకులు అందరిని కూడా మునివేళ్లపై నిలబెడుతుంది అని చెప్పాలి. అయితే క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ  భరితంగా జరుగుతున్న సమయంలో ఎన్నో ఫన్నీ ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక ఇవి చూసి ప్రేక్షకులందరూ కూడా తెగ నవ్వుకుంటూ ఉంటారు. ఇంకొన్నిసార్లు ఏకంగా అందరినీ ఆశ్చర్యపరిచే ఘటనలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఏదైనా జరిగింది అంటే చాలు ఇంటర్నెట్లు అది హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.


 ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా ఒక ప్లేయర్ మంచి ప్రదర్శన చేస్తున్నాడు అంటే ఇక అందులో కోచ్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. ఆఫ్ ఫీల్డ్ లో కోచ్ అద్భుతంగా మెలుకువలు నేర్పించి.. ఒక సాదాసీదా ప్లేయర్ ను బాగా తీర్చి దిద్దిన్నప్పుడే ఆ ప్లేయర్ ఇక గ్రౌండ్లో బాగా రానించగలడు. అయితే ఇక మ్యాచ్ మధ్యలో కూడా ఇలా కోచ్లు ఆటగాళ్లకు సలహాలు ఇవ్వడం ఇప్పటివరకు ఎన్నో సార్లు చూసాము. కానీ ఏకంగా ఆటగాళ్లకు బదులుగా కోచ్లు ఆట ఆడటం ఎప్పుడైనా చూసారా.


 అయినా ఆటగాళ్లకు మెలకువలు చెబుతారు. కానీ కోచ్ లు ఎందుకు మైదానంలోకి వచ్చి క్రికెట్ ఆడతారు అని అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ మాత్రం ఇదే జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్లో కోచ్ గ్రౌండ్ లోకి వచ్చి ఫీల్డింగ్ చేయడం కనిపిస్తుంది. క్రికెట్ హిస్టరీలో ఇలా ఫీల్డర్ కి బదులు కోచ్ వచ్చి ఫీల్డింగ్ చేయడం మొదటిసారి అనుకుంటా. ప్రస్తుతం ఐర్లాండ్తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కోచ్ డుమిని కాసేపు ఫీల్డింగ్ చేశాడు. 49వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. అయితే హీట్ ఎక్కువగా ఉండటం కారణంగా ఆటగాళ్లందరూ తీవ్ర అలసటకు గురయ్యారని.. దీంతో చివరికి కోచ్ వచ్చి మైదానంలో ఫీల్డింగ్  చేయాల్సిన పరిస్థితి వచ్చిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: