ఇండియాలో క్రికెట్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే క్రికెటర్లకు సంబంధించి ఏ విషయం తెరమీదకి వచ్చిన కూడా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గురించి అటు భారత క్రికెట్ ప్రేక్షకులకు  కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఇక అతి చిన్న వయసులోనే టీమ్ ఇండియాలోకి అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్.. దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు ఎవరు సాధించలేని ఎన్నో రికార్డులను కూడా తన పేరిట లికించుకున్నాడు.


 తన టాలెంట్ ఏంటో చూపించి వన్ మాన్ షో చేసి ఏకంగా టీమ్ ఇండియాను విజయతీరాలకు నడిపించిన సందర్భాలు కూడా సచిన్ కెరియర్లో చాలానే ఉన్నాయి అని చెప్పాలి. అందుకే సచిన్ టెండూల్కర్ ని క్రికెట్ దేవుడు అని పిలుచుకుంటూ ఉంటారు భారత క్రికెట్ ప్రేక్షకులు. ఈ కాటు వరల్డ్ క్రికెట్లోనూ సచిన్ టెండూల్కర్ ని స్ఫూర్తిగా తీసుకొని క్రికెట్ లోకి అడుగుపెట్టే యంగ్ ప్లేయర్లు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. అయితే సచిన్ టెండూల్కర్ గురించి తమకు అన్నీ తెలుసు అని అభిమానులు బల్లగుద్ది మరి చెబుతూ ఉంటారు. ఫస్ట్ సెంచరీ ఎక్కడ లాస్ట్ సెంచరీ ఎక్కడ సచిన్ ఎన్ని రికార్డులు సాధించారు. ఇలాంటివన్నీ ఎంతో సింపుల్ గా చెప్పేస్తాం అని చెబుతూ ఉంటారు.


 కానీ సచిన్ టెండూల్కర్ తన కెరియర్లో ఫస్ట్ సెంచరీ ఎప్పుడు చేశారు అన్న విషయంలో ఎవరికి తెలియని నిజాన్ని బయట పెట్టాడు క్రికెట్ దేవుడు సచిన్. ఇక ఈ విషయం తెలిసి అభిమానులకు సైతం షాక్ అవుతున్నారు. తను అధికారికంగా మొదటి సెంచరీ బరోడాలో చేసినట్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం చాలామందికి తెలియదు అంటూ చెప్పాడు. బ్యాంక్ ఆఫ్ బరోడా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. 1986లో తొలి సెంచరీ అండర్ 15 టోర్నమెంట్లో మహారాష్ట్ర తరపున చేసినట్లు చెప్పుకొచ్చాడు. తన 400వ వన్డే మ్యాచ్ కూడా బరోడాకు ఆడినట్లు గుర్తు చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: