ఐపీఎల్ 2025 కోసం మెగా ఆక్షన్ త్వరలోనే నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ జట్టులో పంచుకోవాల్సిన ప్లేయర్ల కోసం రిటెన్షన్ లిస్ట్‌ను సిద్ధం చేస్తున్నాయి. ఈ ఆక్షన్‌లో చాలా మంది స్టార్ ఆటగాళ్లు అవైలబుల్ లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రతి ఫ్రాంచైజీ తమ జాబితాను ఎలా తయారు చేస్తుందనే దానిపై అందరి దృష్టి పడింది. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ తమ రిటెన్షన్ లిస్టు ఎలా మేక్ చేస్తుందనే దానిపై చాలా ఆసక్తి నెలకొంది.
ముంబై ఇండియన్స్ జట్టు గతంలో కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మను ఈ ఆక్షన్‌లో వదిలేయాలని నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అతడిని వదిలేయడం దాదాపు ఖాయమే అని కూడా క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి అయితే, ముంబై ఇండియన్స్ టీమ్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను మాత్రం తమ జట్టులోనే ఉంచుకోవాలని అనుకుంటున్నారు. బుమ్రా గత కొన్ని సీజన్‌ల నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు చాలా కీలకంగా ఉన్నారు. ముఖ్యంగా ఆట చివరి ఓవర్లలో అతను తీసే వికెట్లు జట్టుకు విజయం అందించాయి. గత సీజన్‌లో అతను 20 వికెట్లు తీశారు.
ముంబై ఇండియన్స్ జట్టు సూర్యకుమార్ యాదవ్‌ని తమ జట్టులోనే ఉంచుకోవాలని నిర్ణయించుకుంది. సూర్యకుమార్‌ని 'మిస్టర్ 360' అని కూడా అంటారు. ఎందుకంటే, అతను ఏ దిశగా వచ్చిన బాల్‌ని అయినా కొట్టగలడు. గత కొన్ని సీజన్‌లలో అతను చాలా బాగా ఆడాడు. గత సీజన్‌లో 345 పరుగులు చేశాడు. ఇప్పుడు అతన్ని భారత జట్టుకు టీ20 కెప్టెన్‌గా కూడా చేశారు. అందుకే, ముంబై అతన్ని వదిలిపెట్టాలని అనుకోవడం లేదు.
తెలంగాణకు చెందిన తిలక్ వర్మ అనే క్రికెటర్‌ను కూడా ముంబై జట్టు తమ జట్టులోనే ఉంచుకోవాలని అనుకుంటుంది. తిలక్ గత మూడు సీజన్‌లలో చాలా బాగా ఆడాడు. 2024లో 416 పరుగులు చేశాడు. అందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ముంబై వాళ్ళు టిలక్‌ని తమ జట్టులోనే ఉంచుకోవడానికి ప్రత్యేకంగా ప్రయత్నిస్తారు.అలాగే, ఇషాన్ కిషన్ అనే ఆటగాడిని కూడా ముంబై తమ జట్టులోనే ఉంచుకోవాలని అనుకుంటుంది. ముంబై ఇండియన్స్ జట్టు కొత్తగా ఆడే ఆటగాళ్లలో కోయిట్జీ అనే పేసర్‌ని తీసుకోవాలని ఆశిస్తుంది.