ఛాంపియ‌న్స్ ట్రోపీ 2025 వేదిక మార్పుపై ఇప్ప‌టికే ర‌క‌రకాల ఊహాగానాలు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. మామూలుగా అయితే ఈ యేడాది జ‌రిగే ఛాంపియ‌న్స్ ట్రోపీ ని పాకిస్తాన్‌లో నిర్వ‌హించాలి . అయితే భార‌త్ - పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య ఉన్న రాజ‌కీయ వైరం తో పాటు ర‌క‌ర‌కాల గొడ‌వ‌ల నేప‌థ్యం లో మ‌న దేశ క్రికెట్ జ‌ట్టు పాకిస్తాన్‌లో ప‌ర్య‌టించాలి అంటే భార‌త ప్ర‌భుత్వం అనుమ‌తి త‌ప్ప‌ని స‌రి అని. అయితే మ‌న భార‌త దేశ‌ హోం మంత్రి అమిత్ షా అయితే మ‌న క్రికెట్ జ‌ట్టు పాకిస్తాన్ లో ప‌ర్య‌టించేందుకు ఎంత మాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేదు.


ఇక ఐసీసీ అయితే హైబ్రీడ్ మోడ‌ల్ లో టోర్నీ నిర్వ‌హించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే ఇందుకు పీసీబీ ( పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ) అయితే ఒప్పుకునేది లేద‌ని చెపుతోంది. భార‌త్ - పాకిస్తాన్ మ‌ధ్య రాజ‌కీయ ప‌ర‌మైన . . ఇత‌ర విబేధాలు ఉన్నా క్రీడ‌ల‌కు వ‌చ్చే స‌రికి అవేవి ఉండ‌వంటోంది. అయితే పాకిస్తాన్ కు ఓ భ‌యం  కూడా వెంటాడుతోంది. భార‌త్ క‌నుక ఈ ట్రోఫీకి రాక‌పోతే ఆర్థిక ప‌ర‌మైన ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న భ‌యం ఆ దేశాన్ని వెంటాడుతోంది.


ఇక గ‌తేడాది జ‌రిగిన ఆసియా క‌ప్ టోర్నీని కూడా భార‌త్ హైబ్రీడ్ మోడ‌ల్ లో అయితేనే ఆడుతుంద‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో కొన్ని మ్యాచ్‌లు పాకిస్తాన్ లో జ‌రిగాయి.. కొన్ని మ్యాచ్ లు శ్రీలంక లో జ‌రిగాయి. ఇప్పుడు కూడా భార‌త్ మ్యాచ్ ల‌ను దుబాయ్ లేదా శ్రీలంక కు మార్చేస్తార‌ని తెలుస్తోంది. భార‌త్ సెమీస్ కు వెళితే.. అప్పుడు సెమీస్‌.. ఫైన‌ల్ మ్యాచ్ ల‌ను కూడా మార్చ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. మ‌రి దీనికి పాకిస్తాన్ ఎంత వ‌ర‌కు ఒప్పుకుంటుందో ? అస‌లు ఈ ట్రోఫీ జ‌రుగుతుందా ?  లేదా ? అన్న‌ది పెద్ద స‌స్పెన్సే .

మరింత సమాచారం తెలుసుకోండి: