పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులు ఇక ఆ జట్టు ఆట తీరులో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ పర్యటనకు మరియు దేశ జట్టు వచ్చినప్పుడు మాత్రమే కాదు విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు కూడా పాకిస్తాన్ సత్తా చాట లేక పోతుంది. గతంలో ఏకంగా వరల్డ్ కప్ లో చిన్న టీం చేతిలో ఓడిపోయి.. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్.. మొన్నటికి మన సొంత గడ్డమీద బంగ్లాదేశ్ జట్టు చేతిలో క్లీన్ స్వీప్ అయ్యింది. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో సొంత గడ్డపై సత్తా చాటలేక 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఒక అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది.
ఇంగ్లాండుతో ఏకంగా ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో పాకిస్తాన్ జట్టు ఒక ఇన్నింగ్స్ తో పాటు 47 పరుగుల తేడాతో దారుణ ఓటమిని చవిచూసింది. అయితే తొలి ఇన్నింగ్స్ లో 500 కు పైగా పరుగులు చేసిన ఒక జట్టు.. ఒక ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే ఈ ఓటమితో గత తొమ్మిది టెస్ట్ లలో ఏకంగా ఏడింటిలో పాకిస్తాన్ ఓడిపోయింది. ఇక ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే పాకిస్తాన్ క్రికెట్ ఎంత పతాక స్థాయికి చేరుకుంది అన్న విషయం అర్థమవుతుంది. జట్టులో ఎన్ని మార్పులు చేసిన తరచూ కెప్టెన్లను మార్చిన.. కోచ్లను మార్చిన.. ఏకంగా క్రికెట్ బోర్డు చైర్మన్లు మారినా కూడా ఆ దేశ క్రికెట్ మాత్రం మారడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్లో క్రికెట్ ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉందని ఎంతోమంది విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.