దీంతో రెండు మూడు మ్యాచ్లలో బాగా రాణించక పోయిన కూడా సీనియర్ క్రికెటర్లను అటు సెలెక్టర్లు నిర్మొహమాటంగా పక్కన పెడుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నామ్ అన్న విషయం తెలిసిందే. కానీ కొంతమంది క్రికెటర్లకు మాత్రం అటు సెలెక్టర్లు వరుసగా అవకాశాలు కల్పిస్తున్నారు. కానీ వచ్చిన అవకాశాలను ఆయా క్రికెటర్లు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో ఓపెనర్ అభిషేక్ శర్మ తో వికెట్ కీపర్ సంజు కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. వీరి మీద నమ్మకం ఉంచి సెలెక్టర్లు అవకాశాలు ఇచ్చిన ఆ అవకాశాలను అందుపుచ్చు కోలేకపోతున్నారు ఈ ఇద్దరు ప్లేయర్లు.
అయితే ఇదే విషయం గురించి టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ ఆకాష్ చోప్రా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాళ్ళిద్దరికీ ఛాన్సులు ఇచ్చి కూడా వృధా అంటూ అభిప్రాయ పడ్డాడు. బంగ్లాదేశ్ తో జరిగిన టి20 సిరీస్ లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూలు వచ్చిన అవకాశాన్ని వృధా చేసుకుంటున్నారు అంటూ ఆకాష్ చోప్రా అభిప్రాయ పడ్డారు. ఒక రకంగా ఆ ఇద్దరు టీమిండియాకు పెద్ద మైనస్ అంటూ చెప్పుకొచ్చాడు. భారత జట్టులో ఓపెనర్లకు చాలా పోటీ ఉంది అంటూ గుర్తు చేశారు. ఇప్పటికే రెండు ఛాన్సులు పూర్తయ్యాయి. వికెట్ పారేసుకోకుండా భారీ స్కోరు చేసేందుకు ప్రయత్నించాలి ఆకాష్ చోప్రా సూచించాడు.