ఈ క్రమం లోనే రతన్ టాటా మృతి పై స్పందిస్తున్న ఎంతో మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదిక గా దిగ్భ్రాంతి ని వ్యక్తం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు కూడా సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోతూ ఉన్నాయి. ఈ క్రమం లోనే ప్రస్తుతం మనం దిగ్గజాలుగా పిలుచు కునే కొంత మంది క్రికెటర్ల కెరియర్ను నిల బెట్టింది రతన్ టాటానే అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి.
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కి ఆటలు అంటే ఎంతో మక్కువ. ఇక ఆ ఇష్టం తోనే కొంత మంది క్రికెటర్ల కు ఆయన అండగా నిలుస్తూ వచ్చారు. ఫరూక్ ఇంజనీర్, మహిందర్ అమర్నాథ్, సంజయ్ మంజ్రేకర్, జవగల్ శ్రీనాథ్, అజిత్ అగర్కర్, వి వి ఎస్ లక్ష్మణ్, యువ రాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్, హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప, శార్దూల్ ఠాకూర్, జయంత్ యాదవ్ తదితరులకు టాటా ట్రస్ట్ ద్వారా అండగా నిలుస్తూ వచ్చారు. ఈ ట్రస్ట్ అండ దండల తోనే కొంత మంది దిగ్గజ క్రికెటర్లుగా కూడా ఎదిగారు అని చెప్పాలి.