కాగా ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనలో భాగంగా ఇప్పటికే టెస్టు సిరీస్ ముగించుకుంది భారత జట్టు. టెస్ట్ సిరీస్లో బంగ్లాదేశ్ జట్టును క్లీన్ స్వీప్ చేసింది అన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ లో t20 సిరీస్ లో బరిలోకి దిగింది. ఇక టి20 సిరీస్ లో కూడా భారత జట్టు తిరుగులేని ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన రెండవ టి20లో విజయం సాధించిన భారత జట్టు ఘన విజయాన్ని అందుకుంది.
92 ఏళ్ల తర్వాత టీమిండియా భారత క్రికెట్ హిస్టరీలో ఇలాంటి రికార్డును సొంతం చేసుకోవడం గమనార్హం. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టి20 మ్యాచ్లో ఏకంగా ఏడుగురు భారత బౌలర్లు వికెట్ తీశారు. భారత్ 1932లో అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ఫార్మాట్లో కూడా టీమిండియా లో ఉన్న ఏడుగురు వికెట్లు తీయలేదు. ఇక తాజా ఘటనతో సంచలన రికార్డులను నమోదు చేసింది భారత జట్టు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే టెస్టుల్లో నాలుగు సార్లు, వన్డేల్లో పదిసార్లు, t20 ఫార్మాట్లో నాలుగు సార్లు మాత్రమే ఈ అరుదైన రికార్డు నమోదయింది అని చెప్పాలి.