సాధారణంగా క్రికెట్లో ఎలాంటి రూల్స్ ఉంటాయో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇండియాలో క్రికెట్ కి ఉన్న విపరీతమైన పాపులారిటీ దృశ్య ఈ రూల్స్ గురించి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంటుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో వన్డే t20 టెస్ట్ అనే మూడు ఫార్మాట్లు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఏ జట్టు మ్యాచ్ ఆడాలన్నా ఈ మూడు ఫార్మాట్లలోనే ఏదో ఒక ఫార్మాట్లో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. కానీ గల్లీ క్రికెట్లో లాగా కూడా ఏకంగా ఒక దేశంలో ప్రొఫెషనల్ క్రికెట్లో రూల్స్ ఉంటాయి అంటే ఎవరైనా నమ్ముతారా.


 హాంకాంగ్లో మాత్రం ఇలాంటి విచిత్రమైన క్రికెట్ రూల్స్ ఉంటాయట. సాధారణంగా 11 మంది ప్లేయర్లు ఒక జట్టు తరఫున ఆడటం చూస్తూ ఉంటాం. హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో మాత్రం కేవలం ఒక జట్టులో ఆరుగురు ప్లేయర్లు మాత్రమే ఉంటారట. అంతేకాదు మ్యాచ్ కూడా 5 ఓవర్లలోనే జరుగుతుందట. ఫైనల్ కు వచ్చేసరికి ఒక్కో జట్టు ఎనిమిది ఓవర్లు ఆడాల్సి ఉంటుందట. అంతేకాదు ఫీల్డింగ్ సైడ్ జటులో ఉన్న ప్లేయర్లలో ఒక్క వికెట్ కీపర్ తప్ప మిగిలిన ప్లేయర్ లందరూ కూడా బౌలింగ్ వేసేందుకు అవకాశం ఉంటుందట. అది కూడా కేవలం ఒక్కో ఓవర్ మాత్రమే వేయడానికి చాన్స్ ఉంటుందట.


 ప్రొఫెషనల్ క్రికెట్లో నోబాల్ లేదా వైట్ బాల్ వేసినప్పుడు కేవలం ఒక పరుగు మాత్రమే ఇస్తారు. కానీ అటు హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో మాత్రం ఏకంగా రెండు పరుగులు ఇస్తారట. అయితే ఐదు ఓవర్లలోపే ఐదు వికెట్లను ఒక జట్టు కోల్పోయిందంటే ఆఖరి బ్యాట్స్మెన్ ఇక పార్టనర్ లేకపోయినప్పటికీ కూడా ఆడేందుకు అవకాశం ఉంటుంది. అవుట్ అయిన వారిలో ఎవరో ఒకరు రన్నర్ గా మాత్రమే ఫ్రీజ్ లోకి వస్తారు. ప్రతి బ్యాటర్ 31 పరుగుల వద్దకు రాగానే ఆటోమేటిక్గా రిటైర్ నాట్ అవుట్ అవ్వాలి. ఒకవేళ ఆరు సిక్సర్లతో 36 పరుగులు చేసిన కూడా ఇదే జరుగుతుంది.




అయితే జట్టులో ఉన్న మళ్లీ అందరూ అవుట్ అయిన తర్వాతే అతను మళ్ళీ క్రీజులోకి వచ్చింది అవకాశం ఉంటుందట. టోర్నీలోని ప్రతి మ్యాచ్ లో విజేతగా నిలిచిన చెట్టుకు రెండేసి పాయింట్లు వస్తాయట. ఇక ఆయా గ్రూపులో టాప్ లో నిలిచిన రెండు చెట్లు సెమీ ఫైనల్ కు  అర్హత సాధిస్తాయి. అక్కడ  గెలిచిన రెండు చెట్లు ఇక కప్పు కోసం పోటీ పడతాయి. ఈ విషయం తెలిసి గల్లి క్రికెట్లో కూడా ఇలాంటి విచిత్రమైన రూల్స్ ఎప్పుడూ చూడలేదు అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: