విరాట్ కోహ్లీ నుంచి సారధ్య బాధ్యతలను అందుకున్న రోహిత్ శర్మ కూడా తన సత్తా ఏంటో నిరూపిస్తున్నాడు. ఇక ఇప్పటికే తన కెప్టెన్సీలో టీమ్ ఇండియాకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను అందించి ఇక భారత క్రికెట్ హిస్టరీలో తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లికించుకున్నాడు. ఇంకోవైపు మూడు ఫార్మాట్లలో కూడా అదరగొట్టేస్తున్నారు అని చెప్పాలి. అయితే ఈ ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా విజేతగా నిలచిన తర్వాత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ప్రస్తుతం వన్డే టెస్ట్ ఫార్మట్లలో మాత్రమే కొనసాగుతున్నారు అన్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికే అటు టీమిండియా కు కెప్టెన్ గా విక్టరీలు అందించడంలో రోహిత్ శర్మ వరుసగా అరుదైన రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా విరాట్ కోహ్లీకి ఒక రికార్డు విషయంలో షాక్ ఇవ్వబోతున్నాడట రోహిత్ శర్మ. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్ గా విరాట్ కోహ్లీ పేరిట రికార్డు ఉంది.