ఇండియన్ టెన్నిస్  స్టార్ గా పేరుపొందిన సానియా మీర్జా.. పాకిస్తాన్ క్రికెటర్ సోయాబ్ మాలిక్ ని ప్రేమించి మరి వివాహం చేసుకున్నది. కానీ సడన్గా కొన్ని క్రితం విడాకులు తీసుకుంది సానియా మీర్జా. అయితే షోయబ్ మాత్రం పాకిస్తాన్ నటి అయిన సనా జాదవ్ ను రెండో వివాహాన్ని చేసుకున్నారు. అయితే షోయబ్ కు అది మూడో వివాహం అన్నట్లు సమాచారం. ఇప్పుడు తాజాగా సానియా మీర్జా కూడా త్వరలోనే రెండో వివాహం చేసుకోబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి చూద్దాం.


ప్రస్తుతం సానియా మీర్జా టర్కీ పర్యటనలో ఉన్నదట. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. సానియాతో పాటు ఆమె స్నేహితులు నటి పరిణితి చోప్రా కూడా ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే ఉన్నట్లు సమాచారం. నటి పరిణితి తన భర్త రాజకీయ నాయకుడు రాఘవన్ చద్దతో కలిసి కొన్ని ఫోటోలను షేర్ చేయడంతో పాటుగా సానియా మీర్జా కూడా ఈ ఫోటోలు కనిపిస్తూ ఉన్నది. పరిణితి తన భర్తతో కలిసి సముద్రపు దృశ్యాలను ఆస్వాదిస్తూ ఇద్దరి పాదాలను చూపిస్తూ  కూర్చుని ఒక ఫోటోను షేర్ చేయడం జరిగింది.


సానియా మీర్జా మాత్రం తన కుటుంబ, స్నేహితులతో గడపడానికి టర్కీ కి వెళ్ళినట్లు తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది. అయితే మరొక ఫోటోలు సానియా పరిమితి ఇద్దరూ కూడా చిరునవ్వులు చిందిస్తూ ఉన్నట్టుగా మరొక ఫోటోని షేర్ చేశారు.. అయితే ఇలాంటి సమయంలోనే సోయబ్ మాలిక్ వివాహం చేసుకున్న సమాజాదవ్ మాజీ భర్తని సానియా మీర్జా వివాహం చేసుకోబోతోందని ఊహాగానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. గతంలో సనా జాదవ్ పాకిస్తాన్ గాయకుడనీ పెళ్లి చేసుకున్నది. అయితే ఇటీవల తన ఇంస్టాగ్రామ్ లో షేర్వానీతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేయగా సానియాతో వివాహ బంధం లోకి అడుగు పెట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయమైతే సోషల్ మీడియాలో కూడై కోస్తోంది. అయితే గతంలో కూడా ప్రముఖ క్రికెటర్ షమీతో సానియా పెళ్లి చేసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయాలను అటు సానియా మీర్జా, షమీ ఇద్దరు కూడా కొట్టి పారేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: