ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో ఎక్కడ చూసినా కూడా 2025 ఐపీఎల్ సీజన్ గురించి చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ ఐపీఎల్ సీజన్ కంటెంట్ ముందు మెగా వేలం జరగబోతుంది. దీంతో ఈ మెగా వేలంలో ఏ ఆటగాడిని ఏ జట్టు కొనుగోలు చేయబోతుంది. ఇక ఎలాంటి రికార్డులు బద్దలు కాబోతున్నాయి అనే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటికే కొన్ని టీమ్స్ ఏకంగా కెప్టెన్లను వదులుకునేందుకు కూడా సిద్ధమైయ్యాయి. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక ఫ్రాంచైజీ కేవలం ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఉంది.


 దీంతో కొన్ని ఫ్రాంచైజీలు ఇష్టం లేకపోయినా కొంతమంది ఆటగాళ్ల ను వేలంలోకి వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది జరిగిన వేలంలో సన్రైజర్స్ జట్టు ఏకంగా ప్యాట్ కమిన్స్ ని 20.5 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఇంత అత్యధిక ధరపెట్టడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఇక అతనికి కెప్టెన్సీ కూడా అప్పగించగా ఫ్యాట్ కమిన్స్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కానీ ఇప్పుడు సన్రైజర్స్ జట్టు యాజమాన్యం ప్యాట్ కమిన్స్ ని పక్కకు పెట్టాలని యోచిస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొత్త కెప్టెన్ ను ఎంచుకోవాలి అనే దానిపై దృష్టి సారించింది అన్నది తెలుస్తుంది.


 ఇలాంటి సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఐపీఎల్ 2025 వేలానికి ముందు సన్రైజర్స్ రిటైన్ చేసుకునే ప్లేయర్ల లిస్ట్ ను ఒక క్రీడా ఛానల్ ఇటీవల విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఇక కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ కి గత ఏడాది 20 పైగా కోట్లు పెట్టగా.. గత ఏడాది తన ప్రదర్శనతో అదరగొట్టిన క్లాసన్ కు 23 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటుందట ఆ జట్టు యాజమాన్యం  అయితే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ని వదులుకోకుండా 18 కోట్లకు రిటైన్ చేసుకుందట. అలాగే అభిషేక్ శర్మకు 14 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకోవాలని నిర్ణయించిందని తెలుస్తుంది. అదే సమయంలో హెడ్, నితీష్ కుమార్ రెడ్డిలను కూడా రిటైన్ చేసుకోబోతుందట. కాగా ప్లేయర్ల రిటెన్షన్ ప్రక్రియను ఫైనల్ చేసేందుకు ఈనెల 31 వరకు గడువు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: