ప్రత్యర్థి జట్టుకు కనీస పోటీ ఇవ్వలేక చతికిలబడిపోయింది టీమిండియా. ఎంతలా అంటే ఏకంగా టెస్ట్ ఫార్మాట్లో ఎంతో నిలకడగా ఆడుతూ భారీగా స్కోర్లు చేసే టీమిండియా.. కేవలం 46 పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది దీంతో ఇది నిజమా కాదా అని నమ్మడానికి కూడా భారత అభిమానులకు కాస్త సమయం పట్టింది. అయితే 92 ఏళ్లలో భారత జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఇంత చెత్త ప్రదర్శన చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. జట్టులో ప్రపంచ స్థాయి అత్యుత్తమ బ్యాట్స్మెన్ లు ఉన్న.. ఎవరు ప్రతిభ కనబరచలేకపోయారు.
ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ప్రదర్శన పై కొంతమంది ఆశ్చర్యంలో మునిగిపోతుంటే.. ఇంకొంతమంది మాత్రం తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ విమర్శలు గుర్తిస్తున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది అంటూ విమర్శిస్తున్నారు. అయితే ఇక ఇలా 46 పరుగులకు ఆల్ అవుట్ అవ్వడంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. పిచ్ ను తానే తప్పుగా అంచనా వేసినట్లు చెప్పుకొచ్చాడు. పిచ్ ఫ్లాట్ గా ఉంటుందని భావించానని.. సరిగా అర్థం చేసుకోలేకపోయాను అంటూ రోహిత్ తెలిపారు. ఇక కేఎల్ రాహుల్ స్థానాన్ని పదే పదే మార్చడం ఇష్టం లేకనే.. విరాట్ కోహ్లీని ఫస్ట్ డౌన్లో పంపించినట్లు చెప్పుకొచ్చాడు అయితే జట్టులోని ఆటగాళ్లు కూడా వారి సామర్థ్యానికి తగ్గట్టుగా ప్రదర్శన చేయలేకపోయారు అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.