దీంతో భారత జట్టు ఇలాంటి ప్రదర్శన చేయడం ఏంటి. ఇలాగైతే ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ పట్టికలో ఎలా ముందుకు సాగుతూ ఫైనల్ వరకు చేరుకోగలదు అంటూ ఎంతో మంది పెదవివిరుస్తూ ఉన్నారు. అయితే భారత జట్టు ఇలా న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే పరిమితం కాగా.. ఇదే విషయంపై అటు భారత వెటరన్ బ్యాట్స్మెన్ అజింక్య రహనే స్పందిస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అయిన రహనేను సీనియర్ అన్న కారణంగా అతన్ని సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. అతనికి చాలా రోజుల నుంచి అవకాశాలే దక్కడం లేదు.
ఇలాంటి సమయంలో ఇక భారత జట్టు చెత్త ప్రదర్శన పై అజీంక్య రహానే సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారిపోయింది. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఒక వీడియోని షేర్ చేసిన అజింక్య రహనే స్ట్రైకింగ్ చేయడానికి నేను సిద్ధమే అంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అయితే ఈ పోస్ట్ పై స్పందిస్తున్న నేటిజన్స్.. భయ్యా నీ టైమింగ్ సూపర్ ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టాలో నీకు బాగా తెలుసు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టుకు మద్దతు పలకాల్సింది పోయి ఇలాంటి కామెంట్ చేయడం ఏంటి అని ఇంకొంతమంది స్పందిస్తున్నారు. ఒక రకంగా అజంక్య రహనే కెప్టెన్ రోహిత్ శర్మకు మండేలాగే పోస్ట్ పెట్టాడంటూ ఇంకొంతమంది కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.