ఎందుకంటే భారత జట్టు ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్లో చేసిన ప్రదర్శన ఇందుకు కారణం. సాధారణంగా టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ప్రత్యర్థులపై పైచేయి సాధించి భారీస్ స్కోర్లు చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో మాత్రం కేవలం 46 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో ఇది నిజమా కాదా అని నమ్మడానికి కూడా అభిమానులకు కాస్త సమయం పట్టింది అని చెప్పాలి. అయితే భారత జట్టు లాంటి అగ్రశ్రేణి టీం ఇంత అత్యంత చెత్త ప్రదర్శన చేయడం గురించే అందరూ చర్చించుకుంటున్నారు.
ఇదే విషయాన్ని ఇక ప్రత్యర్థి టీమ్స్ మాజీ ఆటగాళ్లు కూడా తమ అస్త్రంగా మార్చుకుంటూ అటు భారత జట్టు పై విమర్శలకు గుప్పిస్తున్నారు. ఇలా న్యూజిలాండ్ పై భారత్ 46 పరుగులకే ఆల్ అవుట్ కావడాన్ని సానుకూలంగా తీసుకోవాలని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆస్ట్రేలియాతో 36 పరుగులకే ఆల్ అవుట్ అయిన విషయాన్నీ గుర్తుచేసేలా.. కనీసం 36 రన్స్ దాటారు కదా అంటూ హేళన చేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. అయితే ఈ పోస్ట్ పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమ్ ఇండియా పై 2019 నుంచి ఇంగ్లాండు గెలవలేదు. మొన్నటికి మొన్న ఐర్లాండ్ పై 59 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇక మీరు మాకు చెబుతున్నారా అంటూ గట్టిగానే ట్రోలింగ్ చేస్తున్నారు.