అయితే.... టీమిండియా క్రికెటర్లపై ఎప్పుడు స్పందించే.. సర్ఫ రాజ్ ఖాన్ పై మాజీ ప్లేయర్ , కామెంటేటర్ సునీల్ గవాస్కర్ కూడా స్పందించారు. టీమిండియా యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఆట తీరును ప్రసంశించారు సునీల్ గవాస్కర్. దేశవాళి క్రికెట్ లో సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా ఆడేవాడని.. అలాంటి ప్లేయర్ ను ఇప్పటికే సెలెక్ట్ చేయాల్సి ఉండేదని తెలిపారు. కానీ అతని నడుము సన్నగా లేదని... భారత క్రికెట్ నియంత్రణ మండలి... అతన్ని తీసుకోలేదు కావచ్చు అంటూ సునీల్ గవాస్కర్.. సెటైర్లు పేల్చారు.
కానీ సర్ఫరాజ్ ఖాన్ నడుము లావుగా ఉన్న... అతని ఆట అద్భుతంగా ఉందని సునీల్ గవాస్కర్ మెచ్చుకున్నారు. మైదానంలో సర్ఫరాజ్ ఖాన్ ( sarfaraz khan ) చేసే పరుగులు... అతని నడుము చుట్టుకొలత కంటే డేంజర్ గా కనిపిస్తున్నా యని కూడా వెల్లడించారు. అలాంటి ప్లేయర్ ను ఇన్ని రోజులు సెలెక్ట్ చేయకపోవడం దారుణం అన్నారు.
సర్ఫరాజ్ ఖాన్ ఎపిసోడ్ నేపథ్యంలో యోయో పరీక్షలను పక్కన పెట్టాలని కూడా సూచనలు చేశారు సునీల్ గవాస్కర్. దానికి బదులుగా మానసికంగా ఆటగాళ్లు ఎంత బలంగా ఉన్నారో చూడాలని కోరారు. ఒక ప్లేయర్ ఫిట్నెస్ను.. కొలవాలంటే అతని మానసిక పరిస్థితిని అంచనా వేయాలని గుర్తు చేశారు. వాస్తవంగా యోయో టెస్టులో ఒక ప్లేయర్ ఉత్తీర్ణత సాధించాలంటే 16.5% స్కోరు సాధించాల్సి ఉంటుంది.