పూణేలో జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ పట్టు బిగించింది. న్యూజిలాండ్ ను 259 పరుగుల తేడాతో ఆల్ అవుట్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ను ఓపెనర్లు టామ్ లాతమ్, డెవాన్ కాన్వే నిదానంగా ముందుండి నడిపించారు. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ఈ జోడిని అశ్విన్ విడదీశాడు. తన మొదటి ఓవర్ లోనే టామ్ లాథమ్ ను వికెట్ల ముందు బోల్తా కొట్టించారు. క్రీజులోకి వచ్చిన విల్ యంగ్ కూడా తన బ్యాటింగ్ తో కాన్వేకు అండగా నిలిచాడు.
అతన్ని అశ్విన్ కీపర్ క్యాచ్ గా బోల్తా కొట్టించాడు. సెకండ్ సెషన్ లో డెవాన్ కాన్వే 109 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రచిన్ తో కలిసి ఆచితూచి ఆడుతూ సెంచరీ దిశగా సాగాడు. క్రీజులో ప్రమాదకరమైన ఈ జోడిని అశ్విన్ విడదీశాడు. కాన్వేను కీపర్ క్యాచ్ గా పెవీలియన్ కుచేర్చాడు. దీంతో మూడో వికెట్ కు నమోదు అయిన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాన్వే అవుట్ అయినా టామ్ తో కలిసి మిచెల్ ఇన్నింగ్స్ ను రిపేర్ చేసేందుకు ప్రయత్నాలు చేశాడు.
83 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 59 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడిని వాషింగ్టన్ సుందర్ విడదీశాడు. వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడాడు. ఈ మ్యాచ్ లో ఏకంగా 7 వికెట్లు తీశాడు సుందర్. అయితే వాషింగ్టన్ సుందర్ పేరులో వాషింగ్టన్ అని ఎందుకు ఉంది అనే విషయం చాలామందికి తెలియదు.
దీనికి ఓ పెద్ద స్టోరీ ఉంది. తన తండ్రి రంజి ప్లేయర్. అతనిది చాలా పేద కుటుంబం. అతనికి క్రీడలు అంటే మహా ఇష్టం. ఆ సమయంలో పిడి వాషింగ్టన్ అనే ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మనీ సుందర్ కు చిన్నతనంలో క్రికెట్ ఆడడానికి సహాయం చేశాడు. అంతేకాకుండా చదువుకు కూడా సహాయం చేశాడు. ఇక ఆ మాజీ ఆర్మీ ఆఫీసర్ మీద ఉన్న ప్రేమతో తన కుమారుడికి వాషింగ్టన్ అనే పేరును పెట్టుకున్నాడు.