అయితే తాజాగా ఈ విషయం పైన ఒక ఈవెంట్లో పాల్గొన్న మహేంద్ర సింగ్ ధోని క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఐపీఎల్ లో తాను ఆడుతానని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి కొనెళ్ళ పాటు క్రికెట్ ని తాను ఆస్వాదిస్తానంటూ కూడా తెలియజేయడం జరిగింది. మైదానంలో ప్రొఫెషనల్ గా గేమ్ ఆడితేనే కచ్చితంగా విజయాన్ని సాధించగలమని తెలిపారు..T20 WC ఫైనల్ మ్యాచ్ పైన ధోని స్పందిస్తూ క్రికెట్ చివరి వరకు ఏం జరుగుతుందని విషయాన్ని ఎవరు చెప్పలేమని తెలియజేశారు.
మొత్తానికి ఈసారి కూడా ఐపీఎల్ సీజన్ లో ధోని అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ధోని ఐపిఎల్ లో కూడా సరికొత్త రికార్డులను సైతం తిరగరాసిన తర్వాతే అవుతారనే విధంగా అభిమానులైతే భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది సీఎస్కే టీమ్ అంటే ఇష్టపడే వారు కూడా చాలామంది ఉన్నారు.. ముఖ్యంగా 43 ఏళ్ల వయసులో కూడా ధోని స్టేడియంలోకి అడుగుపెట్టి సిక్సులతో బాధేస్తున్నారు. తన మోకాలికి సర్జరీ తర్వాత కొద్దిరోజులు రెస్టు తీసుకున్న ధోని మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈసారి ఐపీఎల్ లో సీఎస్కే టీమ్ కప్పు గెలుస్తుందో లేదో చూడాలి మరి.