స్వదేశంలో టీమిండియా ఎన్నడూ లేనంతగా బక్కబోర్లా పడుకుంటోంది. కాగా ఇది కనివిని ఎరుగం అని సగటు క్రికెట్ క్రీడాకారుడు అంటున్నాడు. అవును, న్యూజిలాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భరత్ వరుసగా భంగపాటుకు గురవుతోంది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర ఓటమి చవిచూడగా, పుణె టెస్టు తొలి ఇన్నింగ్స్లో కూడా విఫలమైంది. కివీస్ తొలి ఇన్నింగ్స్లో 259 పరుగులకే ఆలౌట్ అవ్వగా, భారత్ 156రన్స్కే పెవిలియన్ చేరింది. ఈ క్రమంలో భారత్ టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ ఫెయిల్ కావడంతో ఇపుడు టీమ్ఇండియా డిఫెండబుల్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారాను జట్టులోకి తిరిగి తీసుకురావాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు.

దిగ్గజ ప్లేయర్స్ అయినటువంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కివీస్తో జరుగుతున్న సిరీస్లో పూర్తిగా ఫామ్ కోల్పోవడంతో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. రంజీల్లో అదరగొడుతున్న ఛెతేశ్వర్ పుజారాను ఎందుకు జట్టులోకి తీసుకోలేదని సెలక్టర్లను ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు... 'మాకు ఛెతేశ్వర్ పుజారా కావాలి. ఆసీస్ పిచ్ల్లో వైట్ బాల్ స్పెషలిస్ట్ బ్యాటర్లు ఎక్కువగా రాణించలేరు. ఈ విషయాన్ని మేము మీకు చెప్పాల్సి వస్తుంది.. మీకు తెలియదా? రోహిత్ శర్మ సీమ్ పిచ్ లపై బ్యాటింగ్ సరిగ్గా చేయలేడు. సీనియర్లందర్నీ దేశీయ క్రికెట్ ఆడేలా చేయాలి!' అంటూ ఒక అభిమాని ఎక్స్లో పోస్టు చేయగా ఇపుడు ఆ పోస్ట్ కాస్త వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా ఆ అభిమాని భారత బ్యాటర్లు శాంటర్న్ను అస్సలు ఎదుర్కొలేకపోయారని వాపోయాడు. భారత్ గడ్డ, ప్రేక్షకుల మధ్య విదేశీ ఆటగాడు ఒకడొచ్చి అదరగొడితే మనం అవుల్లాగా చూస్తూ ఉండిపోయాం అని మరొక అభిమాని అభిప్రాయపడ్డాడు. ఇకపోతే ఛతేశ్వర్ పుజారా 2010లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసి, ఆస్ట్రేలియాపై తన డెబ్యూ మ్యాచ్ ఆడాడు. తన కెరీర్లో ఇప్పటివరకు 103 టెస్టులు ఆడిన పుజారా 7195 రన్స్ చేసి అరుదైన ఆటగాడిగా పేరు గడించాడు. అందులో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక భారత్ తరఫున 2023లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన సంగతి అందరికీ తెలిసినదే.

మరింత సమాచారం తెలుసుకోండి: