సొంత గడ్డపై అంత పటిష్టంగా ఉంటుంది భారత జట్టు. మహా మహా టీం సైతం మట్టి కరిపించి అద్భుతమైన విజయాలను సాధిస్తూ ఉంటుంది. ఫార్మాట్ తో సంబంధం లేకుండా విజయాలతో రికార్డులు సృష్టిస్తూ ఉంటుంది. అలాంటి టీమిండియా ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ లో మాత్రం చతికిలబడిపోయింది. ఎక్కడ పోటీ ఇవ్వలేక వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్ లలో ఓడిపోయి ఇక ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను చేజార్చుకుంది. దశాబ్ద కాలం తర్వాత టీమ్ ఇండియా ఇంతటి ఘోర పరాభవాన్ని చవి చూసింది. దీంతో భారత జట్టు ఓటమిని అసలు టీమిండియా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో భారత ఆటగాళ్ల తీరుపై విమర్శలకు గుప్పిస్తున్నారు ఫ్యాన్స్.
కొంతమంది రోహిత్ శర్మ కెప్టెన్సీ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో టోల్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మాజీ ఆటగాడు శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గెలుపోటములే కెప్టెన్సీకి కొలమానాలు కాదు. జట్టులో నాయకుడికి ఉండే గౌరవం బంధం అన్నీ కూడా కీలకమే. న్యూజిలాండ్ సిరీస్ లో ఓడినంత మాత్రాన భారత జట్టు స్థాయి తగ్గిపోలేదు. మన ఆటగాళ్లు అందరూ చాలా ప్రొఫెషనల్స్.. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ లో తప్పకుండా పుంజుకుంటారు అంటూ శిఖర్ ధావన్ కెప్టెన్ రోహిత్ శర్మకి మద్దతుగా నిలబడ్డాడు.