తన కెప్టెన్సీ తో తన ఆటతీరుతో ఏకంగా కోట్లాదిమంది అభిమానులకు గుండెల్లో గుడి కట్టుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే క్రికెట్ రూల్స్ విషయంలో ధోని ఎంత క్లారిటీతో ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వికెట్ల వెనకాల ఉండే ధోని ఎప్పుడైనా ఏదైనా అవుట్ విషయంలో రివ్యూ తీసుకున్నాడు అంటే ప్రత్యర్థి ఆటగాడు సైతం వికెట్ పై ఆశలు వదులుకుంటాడు. అంతలా ధోని నిర్ణయం పై నమ్మకం పెట్టుకుంటారు అందరూ. కానీ ఇక అలాంటి ధోనీకే క్రికెట్ రూల్స్ ఎవరైనా నేర్పిస్తారా..అలాంటి సాహసమే చేయరు. కానీ ధోని భార్య సాక్షి మాత్రం ఇలా చేసిందట.
ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు ఒక ఈవెంట్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గుర్తు చేసుకున్నాడు. తన భార్య సాక్షితో ఇంట్లో జరిగిన సరదా సంభాషణను ధోని ఈ ఈవెంట్ లో పంచుకున్నాడు. నేను, సాక్షి ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం. వైడ్ బాల్ కి ముందుకు వచ్చిన బ్యాటర్ ను వికెట్ కీపర్ స్టంప్ అవుట్ చేశాడు. అది నాటౌట్ అని సాక్షి తేల్చేసింది. వైట్ బాల్ అయినప్పటికీ అది అవుటే అని నేను చెప్పాను. అప్పుడు నీకేమీ తెలియదు నువ్వు ఊరుకో అంటూ సాక్షి నా నిర్ణయాన్ని కొట్టి పారేసింది అంటూ ధోని చెప్పడంతో అక్కడున్న వారందరూ కూడా నవ్వుకున్నారు. అయితే భర్త ఎంతటి ఘనుడైనా భార్య ఎప్పుడు కరెక్ట్ అంటూ ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరూ కూడా ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.