ఇక ఇవి చూసి అటు ఇంటర్నెట్ జనాలు కూడా తెగ నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు అందరూ పడి పడి నవ్వుకునే ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. ఇప్పటివరకు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎంతో మంది ఆటగాళ్లు తమ అద్భుతమైన విన్యాసాలు చేసి ఇక ఫీలింగ్ లో అందరిని ఆశ్చర్యపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మాత్రం విచిత్రమైన ఫీల్డింగ్ గురించి. ఇలాంటి ఫీల్డింగ్ మీరు గల్లి క్రికెట్లో కూడా చూసి ఉండరు.
అంతలా ఇంటర్నెట్ జనాలు ను ఈ ఫీల్డింగ్ నవ్విస్తుంది. ఉమెన్స్ బిగ్ బాస్ లీగ్ 2024 లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఆడి లైట్ స్ట్రైకర్స్, బ్రిస్బెండ్ హీట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో.. బ్రిస్బెన్ క్రికెటర్ జేమ్మ బార్ స్పై బౌలింగ్ చేయగా స్ట్రైకర్స్ బ్యాటర్ బంతిని ఎదుర్కొన్నారు. అయితే ఆ బంతిని అందుకునే క్రమంలో ఆమె నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ కాళ్ల మధ్య నుంచి పాకుతూ ఫీల్డింగ్ చేశారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా.. ఇదెక్కడి ఫీల్డింగ్ సామీ.. గల్లి క్రికెట్లో కూడా ఇంత విచిత్రమైన ఫీల్డింగ్ చూడలేదు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.