క్రికెట్ అభిమానులు ఇపుడు ఐపీఎల్‌ 2025పైనే దృష్టి సారించారు. ఏ ఆటగాళ్లను ఉంచుకుంటారు, ఎవరిని వేలంలో వదిలేస్తారని ప్రస్తుతం క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు చేస్తున్నారు. ఈ క్రమంలో అందరి దృష్టి ధోనీ, కోహ్లీ, కేఎల్ రాహులు, పంత్పై ఎక్కువగా పడింది. రన్ మెషీన్ విరాట్‌ కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు వదులుకుని బ్యాటర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే ఐపీఎల్ సీజ‌న్‌కు చెందిన ప్లేయ‌ర్ల రిటెన్ష‌న్‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెలకొంది అనడంలో అతిశయోక్తి లేదు. అవును, ఎందుకంటే దీనికి గురువార‌మే చివ‌రి తేదీ కాబట్టి. దీంతో ప‌లు ఫ్రాంచైజీలు కొత్త ప్లేయ‌ర్ల కోసం ఎదురుచూస్తున్నాయి.

అయితే, కొంద‌రు ఆట‌గాళ్లు మాత్రం పాత ఫ్రాంచైజీల‌కే ఫిక్స్ అయ్యేందుకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ అవుతోంది. బెంగుళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ జ‌ట్టుకు .. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ప‌గ్గాలు చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్నట్టు సమాచారం. ఐపీఎల్ 2021లో ఆర్సీబీ కెప్టెన్సీని విరాట్ వ‌దులుకున్న సంగతి విదితమే. ఆ త‌ర్వాత నుంచి డూప్లిసిస్ ఆ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించాడు. అయితే ఈసారి కొత్త కెప్టెన్ కోసం ఆర్సీబీ ప్ర‌య‌త్నించిన‌ట్లు గుసగుసలు వినబడుతున్నాయి. గుజ‌రాత్ టైటాన్స్‌కు చెందిన శుభ‌మ‌న్ గిల్‌ను ఆర్సీబీకి ర‌ప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. కానీ గిల్ త‌న పాత ఫ్రాంచైజీతో కొన‌సాగేందుకు మొగ్గుచూపిన‌ట్లు తెలుస్తున్న‌ది.

ఈ నేప‌థ్యంలోనే విరాట్ కోహ్లీకి ఆర్సీబీ సార‌థ్య బాధ్య‌త‌లు ద‌క్కే అవ‌కాశాలు పుష్కలంగా ఉన్నట్టు కనబడుతోంది. దాంతో మన కోహ్లీ అభిమానులు చిందులు తొక్కుతున్నారు. అయితే విరాట్‌ కెప్టన్సీ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడో లేదో ఇంకా తేలాల్సి ఉంది. ఒకవేళ కెప్టెన్‌ బాధ్యతలను విరాట్ తీసుకోకపోతే కేఎల్‌ రాహుల్‌కు అప్పగించాలని బెంగళూరు భావిస్తోందట. కానీ, ఈ విషయంపై ఆర్సీబీ యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏదేమైనా ప్రస్తుతం ఆర్సీబీ కొత్త సారథిగా ఎవరు వస్తారనే విషయంపై తీవ్ర ఆసక్తి కొనసాగుతోంది. ఐపీఎల్‌ చరిత్రలో ఒకే జట్టుకు కొనసాగుతున్న ప్లేయర్ విరాట్‌ కోహ్లీ కావడం విశేషమనే చెప్పుకోవాలి. 2013 నుంచి 2021 వరకూ కెప్టెన్గా ఉన్న అతడు ప్రస్తుతం ప్లేయర్గా కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: