అదేంటి? ఒక్క బంతికి 10 పరుగులు సాధించడమా? ఎలా సాధ్యం? అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. బంగ్లాదేశ్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న 2వ టెస్ట్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌ అదే క్రమంలో ఆ జట్టుకు ఒక్క బంతికే 10 పరుగులు లభించాయి. ఎలా లభించాయి తెలిస్తే, ఆశ్చర్యపోవాల్సిందే. అవును, కనీసం బంతి బ్యాట్ టచ్ చేయకుండానే బంగ్లాదేశ్ ఖాతాలో ఈ పరుగులు చేరిపోవడం కొసమెరుపు. దాంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

విషయం ఏమిటంటే, ఈ మ్యాచ్‌లో మొదట, బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 144.2 ఓవర్లలో 6 వికెట్లకుగాను 575 పరుగుల భారీ స్కోర్ చేసి డిక్లేర్ చేసింది. టోనీ డీ జోర్జీ 269 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులు కొట్టి 177 రన్స్ సాధించాడు. అదేవిధంగా ట్రిస్టన్ స్టబ్స్ 198 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 106, వియాన్ మల్డర్ 150 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 105 (నాటౌట్) శతకాలతో రాణించగా.. సేనురన్ ముతుసామీ 175 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 68, డేవిడ్ బెడింగ్‌హమ్ 78 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 59 హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్(5/198) ఐదు వికెట్లు తీయగా.. నహిద్ రాణా(1/83) ఓ వికెట్ పడగొట్టడం జరిగింది.

ఇక ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్‌కు తొలి బంతికే 10 పరుగులు ఖాతాలో చేరాయి. ఎలాగంటే... సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ఆడుతున్నవేళ ఆ జట్టు బ్యాటర్ “సేనురన్ ముతుసామీ” పదే పదే మిడిల్ పిచ్‌పై పరుగెత్తేవాడు. దాంతో అంపైర్ల మందలింపుకు గురయ్యాడు. ఈ విషయంలో అంపైర్ పలుమార్లు హెచ్చరించినా తన తీరును మార్చుకోలేదు. దాంతో అంపైర్లు నిబంధన ప్రకారం సౌతాఫ్రికాకు 5 పరుగుల పెనాల్టీ విధించారు. దాంతో బంగ్లాదేశ్ ఖాతాలో అప్పనంగా 5 పరుగులు చేరాయన్నమాట. ఇలా మొత్తం 10 పరుగులు ఒక్క బంతికే.. బంగ్లా బ్యాటర్ టచ్ చేయకుండా వచ్చి చేరాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: