ఐపీల్ వేలంలో ఇప్పటి వరకు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లకు ఫ్రాంచైజీలు చెల్లించే కనీస ధర 20 లక్షలు ఉండగా, ఆ ధర చాలా తక్కువ అని నిర్వాహకులు ఫీల్ అవుతున్నట్టు ఐపీల్ వర్గాలు తెలియజెప్పడంతో ఆ ధరకి మరో 10 లక్షలు పెంచుతున్నట్టు తెలుస్తోంది. అది ఇకపై 30 లక్షలు కావచ్చని సమాచారం. అయితే, ఇక్కడ ఐపీఎల్‌లో క్యాప్డ్ మరియు అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ అంటే ఏంటో తెలుసా? సరళంగా చెప్పాలంటే, అన్‌క్యాప్డ్ ప్లేయర్ అంటే తన జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని వ్యక్తి అన్నమాట. ప్రస్తుతం భారత్ తరఫున ఆడని ఆయుష్ బదోనీ, నెహాల్ వధేరా, సమీర్ రిజ్వీ వంటి ఆటగాళ్లు అన్‌క్యాప్‌గా పరిగణించబడతారు.
అదేవిధంగా ఇక్కడ కొన్ని కొత్త అప్‌డేట్‌లు కూడా ఉన్నాయి. బీసీసీఐ 2021లో రద్దు చేసిన రూల్‌ను తిరిగి పెడుతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. విషయం ఏమిటంటే, ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు క్రికెట్ ఆడని మరియు బీసీసీఐతో సెంట్రల్ కాంట్రాక్ట్ లేని ఏ అంతర్జాతీయ ఆటగాడికైనా ఈ నియమం వర్తిస్తుంది. అలాంటివారిని సైతం అన్‌క్యాప్డ్ ప్లేయర్లగా పేర్కొనవచ్చు. ప్రస్తుతానికి, ఫ్రాంచైజీలు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను కొనసాగించాలని నిర్ణయించుకుంటే, ప్రతి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు వారు 4 కోట్ల రూపాయిలను చెల్లించుకోవాలి. ఇక అన్‌క్యాప్డ్‌కి వ్యతిరేకం, క్యాప్డ్ ప్లేయర్‌లు. అంటే అంతర్జాతీయ మిక్స్‌లో ఉన్న ఆటగాళ్లు మరియు వారి జాతీయ జట్లకు ఆడే ఆటగాళ్ళను క్యాప్డ్ ప్లేయర్‌లుగా పరిగణించబడతారు. కాబట్టి, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మరియు కేన్ విలియమ్సన్ అందరూ క్యాప్డ్ ప్లేయర్లుగానే పరిగణించబడతారు.