ఈ మేరకు ఓ సుదీర్ఘమైన పోస్ట్ ను షేర్ చేసుకున్నాడు. అక్టోబర్ 17న నార్త్, ఈస్ట్ ఇంగ్లాండ్ లోని కాస్టల్ ఈడెన్ ఏరియాలో ఉన్న అతను ఇంట్లోకి ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వచ్చి దోపిడికి పాల్పడ్డారని తెలియజేశాడు. ఆ సమయంలో తాను పాకిస్తాన్ పర్యటనకి వెళ్లినట్టుగా చెప్పాడు. దోపిడీ జరిగిన సమయంలో తన భార్య, పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారని కానీ వారికి ఎలాంటి హాని జరగలేదని వెల్లడించాడు.
అక్టోబర్ 17న సాయంత్రం కొంతమంది మాస్కులు ధరించి తన ఇంట్లోకి ప్రవేశించారని వెల్లడించాడు. నగలు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. నాకు, నా ఫ్యామిలీకి ఆ వస్తువులతో చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మరి వేరే వాటితో ఆ వస్తువుల స్తానాన్ని భర్తీ చేయలేను. దయచేసి ఎవరైనా ఈ దోపిడి చర్యలకు పాల్పడ్డారో వారికి ఒకే ఒక్క విన్నపం. ఆ వస్తువులను తీసుకొచ్చి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ చోరీ సమయంలో నా భార్య, పిల్లలు ఇంట్లోనే ఉన్నారని బెన్ స్టోక్స్ చెప్పడం జరిగింది.
అదృష్టవశాత్తు వారికి ఎలాంటి హాని కలగలేదు. శారీరకంగా ఇబ్బంది పడకపోయినా మానసికంగా మాత్రం ఈ ఘటన వారిని బాధిస్తోంది. అంటే అప్పటి పరిస్థితి ఎంత దారుణంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు అని బెన్ స్టోక్స్ తన సోషల్ మీడియా వేదికగా రాసుకోచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.