కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించే ఈ యువ ఆటగాడు.. ఐపీఎల్ లో లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఎంతటి ప్రభంజనం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ఓటమి అంచున ఉన్న కోల్కతా జట్టును తన విధ్వంసకర బ్యాటింగ్తో గట్టెక్కించి విజయాన్ని అందించాడు. యష్ దయాల్ బౌలింగ్లో సిక్సర్ల సునామీ సృష్టించి స్కోర్ బోర్డుకు సైతం ఆయాసం తెప్పించాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత టీమ్ ఇండియాలో కూడా ఛాన్స్ దక్కించుకుని అదరగొట్టాడు.
అయితే ఇంత బాగా రాణించిన ప్లేయర్కు ఐపిఎల్ లో కోట్ల రూపాయల ధర దక్కుతుంది. కానీ కోల్కతా మాత్రం గత ఈ సీజన్ వరకు అతనికి కేవలం 55 లక్షలు మాత్రమే పారితోషకం చెల్లిస్తూ వచ్చింది. దీంతో అతనికి అన్యాయం జరుగుతుందంటూ అభిమానులు కూడా వాపోయారు. అయితే ఇక ఇప్పుడు 2025 ఐపీఎల్ వేలంకి ముందు కోల్కతా రింకు సింగ్ ను రిటైన్ చేసుకుంది. అంతేకాదు అతనికి రూ. 13 కోట్లు చెల్లించింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడు అతని ప్రతిభకు తగ్గ ధర తగ్గిందని ఇన్నాళ్లకు రింకు సింగ్ కి న్యాయం జరిగింది అంటూ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.