అయితే ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ప్రతి ఏడాది మినీ వేలం జరుగుతూ ఉంటుంది. ఈ వేలం జరిగిన ప్రతిసారి కొత్త ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలను జట్టులోకి తీసుకుంటూ ఉంటాయి. 2025 ఐపీఎల్ సీజన్ కి ముందు మెగా వేలం జరుగుతుంది. దీంతో ఇక అన్ని టీమ్స్ లోకి కొత్త ఆటగాళ్ళ రాకతో ఆ టీమ్స్ రూపు రేఖలు మారిపోబోతున్నాయి. అయితే ఎప్పుడు వేలం జరిగినా కూడా స్టార్ ప్లేయర్లకే పెద్ద పీట వేస్తూ ఉండేవి ఫ్రాంచైజీలు. ఇక వారిని దక్కించుకునేందుకు మిగతా వారితో పోటీపడి మరి భారీ ధర పెట్టేందుకు కూడా వెనకడుగు వేసేవారు కాదు. కానీ ఇప్పుడు ఫ్రాంచైజీలు స్టార్ ప్లేయర్ల కంటే యువ ఆటగాళ్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయి.
ఇక ఇప్పుడు 2025 ఐపీఎల్ వేలంకి ముందు రిటెన్షన్ విషయంలో కూడా అన్ని ఫ్రాంచైజీలు ఇలాగే చేసాయ్. ఏకంగా ఫ్రాంచైజీలు అన్ని కలిసికట్టుగా స్టార్ ప్లేయర్లపై పగబట్టాయా అన్న రీతిలో వ్యవహరించాయి. ఎందుకంటే జట్టులో ఉన్న స్టార్ ప్లేయర్లను వేలంలోకి వదిలేసి యువ ఆటగాళ్లకే భారీ ధర పెట్టాయి. ఏకంగా టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహాల్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాగూర్, దీపక్ చాహార్ లాంటి స్టార్ ప్లేయర్లకి ఫ్రాంచైజీలు బిగ్ షాక్ ఇచ్చాయి. వీరందరిని వేలంలోకి వదిలేసాయి. వీరికి బదులుగా యంగ్ ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయ్. దీంతో ఈ స్టార్ ప్లేయర్లందరూ కూడా వచ్చే నెలలో జరిగే మెగా వేలంలో పాల్గొంటారు. వీరి కోసం ఫ్రాంచైజీలు పోటీపడి భారీ ధర పెట్టే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. మరి వేలంలో ఏం జరగబోతుందో చూడాలి.