అయితే రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియడంతో కొత్త కోచ్గా టీమిండియా మాజీ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ భాద్యతలు చేపట్టాడు. అయితే గంభీర్ వచ్చిన తర్వాత టీమిండియా మరింత దూకుడుగా ఆడుతుందని ఇక అద్భుతమైన విజయాలు సాధిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఊహించని రీతిలో భారత జట్టుకు కలలో కూడా ఊహించని పరాజయాలు ఎదురవుతున్నాయి. సొంత గడ్డపై ఓటమి ఎరుగని జట్టుగా ప్రస్తానాన్ని కొనసాగిస్తున్న టీమిండియా కని విని ఎరుగని రీతిలో న్యూజిలాండ్ చేతిలో సొంత గడ్డమీదే ఓటమిని చవిచూసింది. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టెస్ట్ సిరీస్ ని కోల్పోయింది.
దీంతో ఈ ఓటమిని భారత అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే కోచ్ గంభీర్ టీమిండియాలో చేస్తున్న అనవసర ప్రయోగాల వల్ల.. ఇదంతా జరుగుతుందని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య గంభీర్ ఇటీవల న్యూజిలాండ్ చేతిలో ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 లు ఎక్కువగా ఆడటం వల్ల టెస్ట్ క్రికెట్లో ఆటగాళ్లు డిఫెన్స్ కోల్పోతున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశాడు గంభీర్. కివిస్ తో మూడవ టెస్టుకు ముందు ఆయన మాట్లాడుతూ.. విజయవంతమైన ఆటగాళ్లందరూ టెస్టుల్లో మంచి డిఫెన్స్ టెక్నిక్ కలిగి ఉన్నారని చెప్పుకొచ్చారు. టెస్ట్ క్రికెట్లో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించిన కోహ్లీ లాంటి ప్లేయర్లకు డిఫెన్స్ సొంతం అంటూ చెప్పుకొచ్చారు. డిఫెన్స్ క్రికెట్ ఆడటమే టెస్ట్ క్రికెట్కు పునాది లాంటిది అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్. మరి మూడో టెస్టులో అయినా గెలిచి టీమిండియా పరువు నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.