చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు త్వరలో జరగబోయే మెగా ఆక్షన్‌కు ముందు ఐదుగురు ఆటగాళ్లను తమ జట్టులో కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ ఐదుగురిలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు), మతిషా పతిరాణ (రూ.13 కోట్లు), శివం దూబే (రూ.12 కోట్లు), రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు), ఎమ్‌.ఎస్ ధోని ఉన్నారు. ఆశ్చర్యకరంగా, సీఎస్‌కే లెజెండరీ ప్లేయర్ ధోనీని కేవలం రూ.4 కోట్లకు మాత్రమే రిటైన్ చేసుకుంది. ధోని మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్. ఆయన ఉంటే ఏ టీం అయినా గెలవాల్సిందే. అలాంటిది ఈసారి ఆయనకు అంత తక్కువగా అమౌంట్ ఇవ్వడం అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాక సీఎస్‌కేకి ఇంకా ఒక 'రైట్ టు మ్యాచ్' (RTM) అనే ఆప్షన్ ఉంది. అంటే, ఆక్షన్‌లో వేరే జట్టు ఏదైనా ఆటగాడిని కొనుగోలు చేస్తే, సీఎస్‌కే తమకు కావలసిన ఆటగాడిని తిరిగి తమ జట్టులోకి తీసుకోవచ్చు. ఈ ఆప్షన్‌తో పాటు సీఎస్‌కేకి ఇంకా రూ.55 కోట్లు ఖర్చు చేయడానికి మిగిలి ఉంది. అక్టోబర్ 31న ముగిసిన రిటెన్షన్ డెడ్‌లైన్‌కు ముందు, బీసీసీఐ అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల నియమాలను మార్చింది. మెగా ఆక్షన్ నవంబర్ చివర జరగనుంది.

ముందు, ఏ దేశపు జట్టులోనూ ఆడని క్రికెటర్‌ని 'అన్‌క్యాప్డ్' ప్లేయర్ అనేవారు. కానీ ఇప్పుడు ఈ నియమం మారింది. ఇండియా జట్టులో ఆడి, తర్వాత ఆడకపోయినా లేదా జట్టులోకి ఎంపిక కాలేకపోయిన ఆటగాళ్లను కూడా 'అన్‌క్యాప్డ్' ప్లేయర్ అని పిలుస్తున్నారు. ఈ నియమం 2008 నుండి 2021 వరకు ఉంది, కానీ దీన్ని ఎవరూ ఉపయోగించలేదు. ఈ ఏడాది మళ్లీ ఈ నియమాన్ని తీసుకువచ్చారు.ఈ కొత్త నియమం ప్రకారం, ఒక ఇండియన్ క్రికెటర్ గత ఐదు సంవత్సరాలలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడకపోయినా లేదా బీసీసీఐ కంట్రాక్ట్ లేకపోయినా ఆయన్ని 'అన్‌క్యాప్డ్' ప్లేయర్ అని పిలుస్తారు. ఈ మార్పు వల్ల జట్లు ఈ ఆటగాళ్లను తక్కువ ధరకు తీసుకోవచ్చు. ఉదాహరణకు, చెన్నై సూపర్ కింగ్స్ ఎమ్‌ఎస్ ధోనిని కేవలం 4 కోట్ల రూపాయలకు తమ జట్టులో ఉంచుకుంది.

ధోనీ చివరిగా 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు తరఫున ఆడాడు. 2020లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇప్పుడు ఆయన ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఈ కొత్త నియమం ప్రకారం 'అన్‌క్యాప్డ్' ప్లేయర్‌గా ఉన్న ఇతర ఆటగాళ్లలో సందీప్ శర్మ, విజయ్ శంకర్, మొహిత్ శర్మ, పియుష్ చావ్లా ఉన్నారు.మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ, సీఎస్‌కే ఈ నియమాన్ని చాలా తెలివిగా ఉపయోగించుకుంది అని అన్నారు. ఆక్షన్‌లో మరింత మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి సీఎస్‌కే దాదాపు 10 నుండి 15 కోట్ల రూపాయలు ఆదా చేసుకుంది. ధోని ఇండియా కోసం ఆల్రెడీ ఆడాడు కాబట్టి అతడిని  'అన్‌క్యాప్డ్' ప్లేయర్ గా పరిగణించడం సరికాదని కైఫ్ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: