ముంబైలో న్యూజిలాండ్ చేతిలో భారత క్రికెట్ జట్టు 3-0తో ఓడిపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఇండియన్ టీమ్‌లో అందరూ తప్పులు చేయడంతో ఈ ఓటమి ఎదురైంది. టీమ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మలు చెత్త వ్యూహాలు అవలంబించారు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో చాలా చెడు నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే టీమిండియా ఫ్యాన్స్ నుంచి చాలా విమర్శలు ఎదుర్కొన్నారు.
భారత బ్యాటింగ్ లైనప్, ముఖ్యంగా మిడిలాడర్ బ్యాట్స్‌మెన్లు న్యూజిలాండ్ బౌలర్లను అసలు పేస్ చేయలేకపోయారు. తక్కువ స్కోర్లను కూడా చేధించడం కష్టమైంది. రోహిత్ శర్మ స్వయంగా తక్కువ స్కోర్లు చేయడంతో కీలక సమయాల్లో జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. కెప్టెన్ గా, బ్యాటర్ గా అతడు ఫెయిల్ అయ్యాడు. దూకుడుగా ఆడి స్కోర్ పెంచుతామని ప్రయత్నించాడు కానీ అదే బ్యాక్ ఫైర్ అయ్యింది. అది ఒక పెద్ద తప్పిదం అని చెప్పుకోవచ్చు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టుకు బలంగా ఉండాలి, కానీ వారు తొందరగా ఔట్ అయిపోయారు. దీంతో మిగతా ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగింది. భారత బౌలర్లు, ముఖ్యంగా స్పిన్ బౌలర్లు న్యూజిలాండ్ ఆటగాళ్లను ఆపలేకపోయారు. ఫీల్డింగ్‌లో చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల భారత్‌కు నష్టం జరిగింది. చివరికి భారత జట్టు ఒత్తిడిని తట్టుకోలేకపోయి ఓడిపోయింది. ఇది భారత క్రికెట్‌కు చాలా పెద్ద ఓటమి.
భారత బ్యాట్స్‌మెన్లు స్పిన్ బౌలింగ్‌కు అలవాటు పడకపోవడం వల్ల వికెట్లు కోల్పోయారు. భారత ఫీల్డర్లు కీలకమైన క్యాచ్‌లు వదిలేశారు, బౌండరీలను అడ్డుకోలేకపోవడం వంటి తప్పులు చేశారు. ఈ తప్పులు భారత జట్టుకు నష్టం కలిగించాయి. న్యూజిలాండ్ జట్టు అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేసింది. వారి బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లు, ఫీల్డర్లు అద్భుతంగా ఆడారు. వరల్డ్ కప్ టోర్నమెంట్ లో గెలవడమే వారి ధ్యానం దానికి అనుగుణంగా బాగా స్టడీ చేశారు. ఇండియన్ టీం ని ఎలా చిత్తు చేయాలో ముందు నుంచే చక్కని ప్రణాళిక వేసుకున్నారు. టీమిండియా వాళ్ళు మాత్రం సరైన ప్రణాళిక లేక వరల్డ్ కప్ టెస్ట్ గెలిచే ఛాన్స్‌లను బాగా కోల్పోయారు. ఇందులో ఒకరి తప్పిదం మాత్రమే ఉందని చెప్పడానికి లేదు. అందరి తప్పిదంగా ఉంది అందుకే ఘోర పరాజయం పాలయ్యింది.