ఇటీవల రోహిత్ శర్మ తన కెరీర్ లోనే అత్యంత అవమానకరమైన ఓటమిని చవి చూశాడు. భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ చేతిలో 0-3 తో ఘోరంగా ఓడిపోయింది. సొంత గడ్డపైనే ఇలాంటి పరాజయం ఎదుర్కోవడం భారత క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా మొదటి రెండు టెస్టు మ్యాచుల్లో భారత జట్టు పూర్తిగా ఆధిపత్యం కోల్పోయింది. వాంకడే స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో కొంత ఆశ చూపించినప్పటికీ, భారత బ్యాట్స్‌మెన్‌లు న్యూజిలాండ్ స్పిన్నర్ల ముందు తడబడ్డారు. రిషబ్ పంత్ ఒక్కడే బాగా ఆడాడు. రోహిత్ శర్మ తన సేన కలిసి సమన్వయంతో ఆడలేకపోయారని అంగీకరించాడు.

"ఒక సిరీస్ లేదా టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం చాలా కష్టం. దాన్ని అంగీకరించడం మరీ కష్టం," అని రోహిత్ మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ చెప్పాడు. "మేం బెస్ట్ క్రికెట్ ఆడలేదు. దాన్ని మేం అంగీకరించాలి. న్యూజిలాండ్ జట్టు మాకంటే చాలా బాగా ఆడింది. మేం చాలా తప్పులు చేశాము. బెంగళూరు, పుణెలో మొదటి ఇన్నింగ్స్‌లో తగినంత పరుగులు చేయలేకపోయాము, దీంతో మేం ఆటలో వెనుకబడ్డాము. ఇక్కడ, మాకు 30 పరుగుల ఆధిక్యం ఉంది. మేము బాగా చేస్తున్నామని అనుకున్నాము, కానీ మరింత బాగా ఆడాల్సి ఉంది."

"నేను ఈ సిరీస్‌లో ఎక్కువ దూకుడుగా షాట్స్ ఆడాను కానీ అది జట్టు గెలవకపోతే కనిపించదు కదా అని రోహిత్ శర్మ అన్నాడు. 'నేను ఎక్కువ పరుగులు చేయాలనుకున్నాను, అదే నా మనసులో ఉంది. కానీ అది జరగలేదు, అలా జరగకపోతే బాగా కనిపించదు. నేను బ్యాటింగ్‌కు వెళ్ళే ముందు నా మనసులో కొన్ని ప్రణాళికలు ఉండేవి, కానీ ఈ సిరీస్‌లో అవి పని చేయలేదు, ఇది నాకు చాలా నిరాశ కలిగిస్తోంది' అని ఆయన చెప్పారు. మూడో టెస్టులో శుభ్ మన్‌ గిల్, రిషబ్‌ పంత్‌ మాత్రమే బాగా ఆడారు అని రోహిత్ ప్రశంసించారు. అయితే ఈ సిరీస్‌ ఓడిపోవడం నన్ను చాలా కాలం బాధపెడుతుంది" అని ఆయన అంగీకరించారు.

"రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ ఈ మైదానాల్లో ఎలా బ్యాటింగ్ చేయాలి అని చూపించారు. ముందుగా ఆలోచించి, ఆటను ముందుకు తీసుకెళ్లాలి. మేం గత 3-4 సంవత్సరాలుగా ఇలాంటి మైదానాల్లో ఆడుతున్నాం కాబట్టి, ఎలా ఆడాలి అన్నది మాకు తెలుసు. కానీ ఈ సిరీస్‌లో అది పనిచేయలేదు, ఇది మనకు పెయిన్ ఫుల్ గా ఉంటుంది. నేను కూడా బ్యాటర్‌గా లేదా కెప్టెన్‌గా రాణించలేకపోయా. అదే నన్ను బాధిస్తోంది. అయితే, మేం జట్టుగా బాగా ఆడలేదు, అందుకే ఓడిపోయాము" అని రోహిత్ ముగించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: