ఆస్ట్రేలియా :
ప్రస్తుతం టేబుల్ లో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా ఇంకా ఏడు టెస్టులు ఆడాల్సి ఉంది. అందులో స్వదేశంలో భారత్తో ఐదు టెస్టులు బార్డర్ - గవాస్కర్ ట్రోఫీ ఆడనుంది. తర్వాత రెండు టెస్టుల శిరీష్ కోసం శ్రీలంక పర్యటనకు వెళుతుంది ఆసీస్ ఈ ఏడు మ్యాచ్లో ఐదు విజయాలు సాధిస్తే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ఫైనల్ కు వెళుతుంది.
భారత్ :
భారత్ ఇంకా ఐదు మ్యాచ్లే ఆడాల్సి ఉంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో ఆసీస్ వేదికగా ఈ ఐదు మ్యాచ్‌లు భారత్‌కు సవాల్ గా మారింది. భారత్ ఫైనల్ కు చేరాలంటే కనీసం ఈ సిరీస్ ను 4 - 0 తో కైవసం చేసుకోవాలి.. అంటే నాలుగు మ్యాచ్‌ల్లో తప్పకుండా విజయం సాధించాలి. ఐదో మ్యాచ్లో గెలవకపోయినా కనీసం డ్రా అయిన చేసుకోవాలి. ఆసీస్‌ను సొంత గడ్డపై 4 - 0 తో ఓడించడం అంత తేలికైన విషయం కాదు.
శ్రీలంక :
శ్రీలంక ఇటీవల న్యూజిలాండ్ పై రెండు టెస్టుల సిరీస్ ను 2 - 0 తో కైవసం చేసుకుని అనూహ్యంగా ఫైనల్ రేసులోకి వచ్చింది. లంక ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో రెండు సౌత్ ఆఫ్రికా... రెండు శ్రీలకంతో స్వదేశంలో ఆడనుంది ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే శ్రీలంక ఫైనల్ కి వెళుతుంది.
న్యూజిలాండ్ :
న్యూజిలాండ్ శ్రీలంక చేతిలో ఘోర ఓటమి చూసిన భారత్ తో టెస్ట్ సిరీస్ ను 3 - 0 తో కైవసం చేసుకుని ఫైనల్ రేసులోకి దూసుకు వచ్చింది. న్యూజిలాండ్ ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. నవంబర్లో ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులు సీరిస్ ఆడాల్సి ఉంటుంది. ఈ మూడు ఖచ్చితంగా గెలిస్తే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా న్యూజిలాండ్ ఫైనల్ కి వెళుతుంది.
సౌత్ ఆఫ్రికా :
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ 2 - 0తో కైవసం చేసుకున్న ఈ జట్టు టాప్ ఫైవ్లోకి వచ్చింది. వీళ్ళు ఇంకా నాలుగు టెస్టులు వాడాల్సి ఉంది.. శ్రీలంక - పాకిస్తాన్ తో రెండేసి టెస్టులు ఆడనున్న దక్షిణాఫ్రికా ఈ నాలుగు మ్యాచ్లలో తప్పక విజయం సాధిస్తే ఫైనల్ కు వెళుతుంది. అయితే ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ స్వదేశంలో జరుగుతుండటం సౌత్ ఆఫ్రికాకు కలిసి వచ్చే అంశం.