అయితే ఇంత పెద్ద పెద్ద భవనాలను నిర్మించడం మాత్రమే కాదు ఆ భవనాలలో మెట్లు ఎక్కకుండా ఏకంగా లిఫ్టు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో లీఫ్ట్ లేని ఇల్లు లేదు అనడంలో సందేహమే లేదు. కేవలం పెద్ద పెద్ద భవనాలలో మాత్రమే కాదు అటు చిన్న ఇళ్లల్లో కూడా ఇలాంటి లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు అందరూ అయితే ఇప్పటివరకు అందరూ కూడా ఇలా లిఫ్ట్ లో ప్రయాణించే ఉంటారు. దీంతో లిఫ్ట్ ఎలా ఉంటుంది ఎలా ప్రయాణిస్తుంది. లిఫ్ట్ లోకి ఎక్కినప్పుడు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి అన్న విషయం కూడా దాదాపుగా అందరికీ ఒక అవగాహన ఉంటుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మాత్రం మీరు ఇప్పటివరకు కానీ విని ఎరుగని లిఫ్ట్.
సాధారణంగా లిఫ్ట్ లోకి ఎక్కినప్పుడు అందులో ఉన్న వారందరూ సురక్షితంగా ఉండేందుకు లిఫ్ట్ డోర్ ఒక్కసారిగా క్లోజ్ అవుతుంది. అది ఎక్కడైనా ఫ్లోర్ కి వెళ్ళినప్పుడు మాత్రమే మళ్ళీ తెచ్చుకుంటుంది. కానీ ఇక మనం మాట్లాడుకోబోయే లిఫ్ట్ కి మాత్రం అసలు డోర్ కూడా ఉండదు. అదేంటి డోర్ లేని లిఫ్టా. అది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు కదా. యూరప్ లోని కార్యాలయాల్లో వినియోగించిన వాటర్నోస్టర్ లిఫ్ట్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. డోర్ ఉండదు ఎక్కడ ఆగకుండా లూప్ మోడ్ కిందికి పైకి తిరుగుతూనే ఉంటుంది. ఇక రన్నింగ్ లో ఉన్నప్పుడే జాగ్రత్తగా లిఫ్ట్ లోకి ప్రవేశించాలి. బయటికి రావడం చేయాలి. 1860 లలో లివర్ పూల్ కు చెందిన ఆర్కిటెక్ట్ పీటర్ దీనిని కనుగొనగా.. భద్రత దృశ్య 1970లో దీనిని నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ఇలా డోర్ లేని లిఫ్ట్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.