వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో రెండు సార్లు ఫైనల్ వరకు వెళ్లిన టీమిండియా చివరి అడుగులో మాత్రం బోల్తా పడింది. దీంతో రెండుసార్లు రన్నర్ ఆఫ్ గానే సరిపెట్టుకుంది. అయితే ఈసారి ఎలాగైనా ఫైనల్ వరకు చేరుకోవడమే కాదు ఫైనల్ లో కూడా విజయం సాధించి సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి వరల్డ్ టెస్ట్  ఛాంపియన్షిప్ రేసులో టాప్ గేర్లో దూసుకుపోతుంది. ప్రత్యర్ధులు ఎవరైనా సరే చిత్తుగా ఓడిస్తు పాయింట్ల పట్టికలో పైపైకి దూసుకు వచ్చింది.


అలాంటి టీమ్ ఇండియాకు ఇటీవలే సొంతగడ్డ మీదే ఘోర పరాభవం ఎదురయింది అన్న విషయం తెలిసిందే. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడిన టీమిండియా మూడింటిలో కూడా ఓడిపోయింది. దీంతో ఒకరకంగా సొంత గడ్డమీద క్లిన్ స్వీప్ అయింది అని చెప్పాలి. ఇక ఈ ఓటమితో అటు డబ్ల్యుటిసి ఫైనల్ వెళ్లే అవకాశాలు కూడా సన్నగిల్లాయి. అయితే సొంత గడ్డమీద ఇలాంటి ఘోర పరాభవం ఎదుర్కోవడంతో ఈ ఓటమిని అటు భారత జట్టు అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక టీమిండియా ఆట తీరుపై భారత మాజీలు సైతం అటు విమర్శలకు గుప్పిస్తున్నారు.


 అయితే ఇలా సొంత గడ్డపై భారత జట్టు 3-0 తేడాతో ఓడిపోవడంపై అటు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ఓటమి జీర్ణించుకోలేనిది. ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇది ప్రిపరేషన్ లోపమా.. పేలవమైన షాట్ ఎంపికా లేక ప్రాక్టీస్ లోపమా అంటూ ప్రశ్నించాడు. తొలి ఇన్నింగ్స్ లో గిల్ నిలకడగా రాణించారు. రెండు ఇన్నింగ్స్ లోను మంచి ప్రదర్శన చేశాడు. అతడి ఆట పూర్తి భిన్నంగా అనిపించింది. సిరీస్ అంతా కూడా నిలకడగా రాణించిన న్యూజిలాండ్ కు ఇక క్రెడిట్ దక్కుతుంది అంటూ సచిన్ వాక్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: