ఏకంగా భారత జట్టు అటు న్యూజిలాండ్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. న్యూజిలాండ్ టీమిండియా మధ్య జరిగిన మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భారత జట్టు 3-0 తేడాతో చివరికి సిరీస్ ను చేజార్చుకుంది. ఇలా టీమిండియా అటు సొంత గడ్డపై క్లీన్ స్వీప్ కావడం మొదటిసారి. దీంతో ఈ ఓటమిని అటు భారత జట్టు అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే గత కొన్నెళ్ల నుంచి కూడా అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ వరకు వెళ్తున్న టీమిండియా ఇక ఫైనల్ మ్యాచ్లో మాత్రం ఓడిపోయి రన్నర్ అఫ్ గానే సరిపెట్టుకుంటుంది.
ఇటీవల న్యూజిలాండ్ చేతిలో దారుణమైన ఓటమి నేపథ్యంలో అసలు టీమిండియా ఫైనల్ వరకు వెళ్లగలదా లేదా అన్న విషయంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. ఇలా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రైస్ లో టాప్ గేర్ లో దూసుకు వెళ్తున్న భారత జట్టుకు.. న్యూజిలాండ్ షాక్ ఇచ్చి ఒకసారిగా స్పీడ్ కు బ్రేకులు వేసింది. అయితే ఒక్క సిరీస్ ఓటమితో పరిస్థితి మొత్తం తలకిందులైంది. ఇప్పుడు భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియా తో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 4-0 తేడాతో గెలవాలి. ఆస్ట్రేలియాను వారి గడ్డపై ఒక్క టెస్ట్ లో ఓడించడమే కష్టం. అలాంటిది సిరీస్ గెలవాలంటే దాదాపు అసాధ్యమే అని చెప్పాలి. ఒకవేళ భారత్ ఆస్ట్రేలియా చేతిలో కూడా ఓటమి చవి చూస్తే ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం కష్టమే అవుతుంది.