వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతున్న టీమిండియా ఎప్పుడు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ ఉంటుంది. అలాంటిది ఇక సొంత గడ్డపై అయితే టీమిండియా కు తిరుగే లేదు. భారత జట్టును ఇక ఇండియాలో ఓడించే జట్టు ప్రపంచం లో లేదు అనడం లో సందేహం కూడా లేదు. ఎందుకంటే ఇక ఏ జట్టు భారత పర్యటనకు వచ్చిన చివరికి టీమిండియా చేతి లో ఓడిపోయి నిరాశ తో పయనం అవుతూ ఉంటుంది.


 ఎన్నో ఏళ్లుగా భారత జట్టు అటు సొంత గడ్డ పై ఇలాంటి విజయ వంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. కానీ ఇటీవల భారత జట్టు విజయ పరంపరకు బ్రేకులు పడ్డాయి. ఏకంగా ఊహించని ప్రదర్శన తో టీమ్ ఇండియాను సొంత గడ్డ మీద న్యూజిలాండ్ దెబ్బ కొట్టింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో ఫుల్ స్పీడ్ తో దూసుకుపోతున్న టీమ్ ఇండియాకు ఒక్కసారిగా అడ్డుకట్ట వేసింది న్యూజిలాండ్ జట్టు. ఇటీవల భారత పర్యటనకు వచ్చి టీమిండియా తో మూడు మ్యాచ్ల t20 సిరీస్ ఆడిన న్యూజిలాండ్ 3-0 తేడాతో భారత జట్టును సొంత గడ్డ మీదే క్లీన్స్వీప్ చేసింది.



 ఈ క్రమం లోనే టీమిండియా పై తీవ్ర స్థాయి లో విమర్శలు కూడా వస్తున్నాయి. కాగా ఈ విషయంపై భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ స్పందించాడు. భారత్ పై టెస్టు సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ టీంను అభినందించాడు. భారత జట్టుకు టర్నింగ్ పిచ్ లు శత్రువులుగా మారుతున్నాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు హార్భజన్ సింగ్. టీమిండియా మెరుగైన పిచ్ లపై ఆడాలని చాలా ఏళ్ల నుంచి చెబుతున్నా. ఈ టర్నింగ్ పిచ్ లు ప్రతి బ్యాటర్ను చాలా సాధారణం గా కనిపించేలా చేస్తున్నాయి అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు హర్భజన్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: