వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీం గా కొనసాగుతున్న టీమ్ ఇండియా గత కొన్నేళ్ల నుంచి మూడు ఫార్మట్ లలో తిరుగులేని ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది.  ప్రత్యర్ధులపై పూర్తిస్థాయి పైచేయి సాధిస్తూ ఇక అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. అలాంటి టీమ్ ఇండియాను అటు సొంత గడ్డపై కొట్టే జట్టు ఇప్పటివరకు లేనేలేదు. ఎందుకంటే భారత జట్టు సొంత గడ్డపై ఏ ఫార్మాట్లో సిరిస్ ఆడిన విజయం మాత్రం టీమిండియానే వరిస్తూ ఉంటుంది. ఇక ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడం టీమిండియా నైజం. అందుకే భారత పర్యటనకు వచ్చినప్పుడు ఏ టీం అయినా సరే విజయం పై పెద్దగా అంచనాలు పెట్టుకోదు.


 అలాంటిది ఇటీవల టీమిండియా కు అటు సొంత గడ్డ మీదే ఘోర పరాజయం ఎదురైంది. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ చేతిలో అటు టీమ్ ఇండియా దారుణంగా ఓడిపోయింది. మూడు మ్యాచ్ లలో టెస్ట్ సిరీస్ లో మూడింటిలో కూడా ఓడిపోయి క్లీన్ స్వీప్ అయింది. అయితే భారత జట్టు ఇలా సొంత గడ్డపై క్లీన్ స్వీప్ కావడం ఇదే మొదటిసారి. ఇక ఈ ఓటమిని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు టీమిండియా అభిమానులు. ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మాట్లో రాణించలేకపోయిన భారత బ్యాట్స్మెన్లు తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.


 అయితే ప్రస్తుతం న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమి నేపథ్యంలో  అటు అభిమానులు అందరూ కూడా ఇద్దరు ఆటగాళ్లను గుర్తు చేసుకుంటున్నారు. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ గా పేరు సంపాదించుకున్న  రహానే, పూజారాలను టీమిండియా ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. టెస్ట్ ఫార్మాట్లో టీమ్ ఇండియాలో వీరు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. గెలిచే మ్యాచ్ లో కూడా టీం ఇండియా ఓడి పోయిందని.. ఇకనైనా బీసీసీఐ తేరుకొని సమర్థులైన వారిని జట్టు లోకి తీసుకోవాలి అంటూ సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: