అంతేకాకుండా ఇటీవల అయితే మరి టెన్షన్ లిస్ట్ ని కూడా అటు బీసీసీఐకి సమర్పించాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని టీమ్స్ యాజమాన్యాలు ఏకంగా తమ జట్టు కెప్టెన్లను కూడా వేలంలోకి వదిలేసాయ్. దీంతో ఆయా టీమ్స్ కి కొత్త కెప్టెన్గా ఎవరు రాబోతున్నారు అనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది. అదే సమయంలో ఇక 2025 ఐపీఎల్ సీజన్ కి ముందు జరగబోయే మెగా వేలం ఎప్పుడు ఎక్కడ జరగబోతుంది అనే విషయం తెలుసుకునేందుకు కూడా భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఇక ఇప్పుడు ఈ మెగా వేలంకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది అన్నది తెలుస్తుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం ఈనెల 24 - 25 తేదీలలో జరగబోతుందట. సౌది అరేబియాలోని రియాజ్ లో ఈ మెగా ఆక్షన్ ప్రక్రియ జరగబోతుందని.. క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే దీనికి బీసీసీఐ ఇప్పటికే ఏర్పాట్లు చేయడం కూడా మొదలుపెట్టిందట. ఇక త్వరలోనే దీనికి సంబంధించి బీసీసీఐ అధికారిక ప్రకటన చేయడానికి సిద్ధమవుతుందట. అయితే అదే సమయంలో ఈ నెల 22 - 26 వరకు పెర్త్ లో ఆస్ట్రేలియా తో భారత్ మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడబోతుంది. ఈ మ్యాచ్ ప్రసారం చేయడంతో పాటు మెగా వేలంను ఒకే సమయంలో ప్రచారం చేయడానికి అటు స్టార్ స్పోర్ట్స్ ఇబ్బంది పడే అవకాశం ఉంది.