ఇటీవల న్యూలిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత జట్టు ఎంత చెత్త ప్రదర్శన చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటి వరకు భారత జట్టును సొంత గడ్డం మీద కొట్టే జట్టు మరొకటి లేదు టీమిండియా ఫ్యాన్స్ అందరూ కూడా బల్లగుద్ది మరీ చెప్పేవారు. కానీ ఇటీవల ఏకంగా టీమ్ ఇండియాను న్యూజిలాండ్ జట్టు సొంత గడ్డ మీదే ఓడించింది. అది కూడా మామూలు ఓటమి కాదు. కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లో కూడా భారత జట్టు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను అటు న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేసేసింది.


 ఈ క్రమంలోనే భారత జట్టు ఆటగాళ్ల తీరుపై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక భారత జట్టు ఓటమిపై అటు మాజీ ఆటగాళ్లు కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే టీమిండియాలోని ఆటగాళ్లందరూ కూడా చెత్త ప్రదర్శన చేయడం ఒక ఎత్తైతే.. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఆటగాడు అయితే చెత్త ప్రదర్శన అనే పదానికే కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ప్రదర్శన చేశాడు. సాధారణంగా ఒక ఆటగాడు ఒక మ్యాచ్ లో ఒక్కసారి డకౌట్ అవ్వడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ ఒకే మ్యాచ్ లో రెండుసార్లు డకౌట్ అవడం ఎప్పుడైనా జరుగుతుందా.



 కానీ ఇక్కడ ఒక భారత ప్లేయర్ మాత్రం ఇలాంటి చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్లో భారత ప్లేయర్ ఆకాష్ దీప్ అరుదైన చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. రెండు ఇన్నింగ్స్ లో అతను కనీసం ఒక్క పరుగు కూడా చేయలేదు. తొలి ఇన్నింగ్స్ లో డైమండ్ డక్ అంటే ఒక్క బంతి కూడా ఆడకుండానే రన్ అవుట్ అయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో గోల్డెన్ డక్ అంటే ఆడిన తొలి బంతుకే బౌల్డ్ అయ్యాడు. దీంతో ఒకే మ్యాచ్లో ఇలా డైమండ్ డక్, గోల్డెన్ డకౌట్ గా నిలిచిన ప్లేయర్గా చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: