మొన్నటి వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ లో ఫుల్ స్పీడ్ తో దూసుకుపోయిన టీమ్ ఇండియాకు న్యూజిలాండ్ జట్టు బ్రేకులు వేసింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా పటిష్టమైన భారత జట్టును ఏకంగా సొంత గడ్డం మీదే ఓడించి న్యూజిలాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో మూడింటిలో కూడా విజయం సాధించి ఏకంగా భారత జట్టును ఇండియాలోనే క్లీన్స్వీప్ చేసింది న్యూజిలాండ్. ఇలా టీమిండియా పై చారిత్రాత్మక విజయాన్ని సాధించింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే భారత జట్టు ఆట తీరును చూసిన తర్వాత అభిమానులు అందరిలో కూడా ఆందోళనలో మొదలయ్యాయి. అసలు టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వరకు చేరుకుంటుందా లేదా అని అనుమానాలు నెలకొన్నాయ్. అదే సమయంలో భారత జట్టు.. మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది.


 సొంత గడ్డ మీదే న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ లో డీల పడిపోయిన టీమ్ ఇండియా ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టును ఏకంగా వారి దేశంలోనే ఓడించగలదా అని అనుమానాలు కూడా తెరమీదకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే ఇక భారత టెస్టు టీం లో సీనియర్లుగా కొనసాగుతున్న రోహిత్, కోహ్లీ, అశ్విన్, జడేజా భవితవ్యం ఏంటి అనే విషయంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక వీరి భవితవ్యం ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తేలనుంది అని తెలుస్తుంది. ఇండియా డబ్ల్యూటీసి ఫైనల్ కు క్వాలిఫై అవ్వకపోతే ఇక ఈ సీనియర్లకు ఇదే చివరి సిరీస్ అవచ్చు అని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. టెస్టుల్లో తమ భవితవ్యం పై రోహిత్ తాజాగా వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. తాను ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదని తన దృష్టి మొత్తం కేవలం ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ పైనే ఉంది అంటూ రోహిత్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: